నవతెలంగాణ – మాక్లూర్
ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవం జరుపుకోవాలని సి ఐ శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలోని ఎస్ ఆర్ గార్డెన్ పక్షన్ హల్ లో మాక్లూర్ పోలీస్ స్టేషన్ ఆద్వర్యంలో పీ సీ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రూరల్ సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాస్ పాల్గొని మాట్లాడారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన గణేష్ విగ్రహ ఏర్పాటు చేసే నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. ప్రతి రోజూ గణేష్ మండపం వద్ద ఇద్దరు నిద్రాంచాలని, విద్యుత్ తీగలు అమర్చడం లాంటి సమయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతి గణేష్ మండపం గుర్తింపు కోసం అన్ లైన్ లో నమోదు చేసుకోవాలని తెలియజేశారు. మట్టి గణేష్ విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలని, కెమికల్ ఉన్న వాగ్రహాలను పెట్టడం వల్ల నీటి కాలుష్యం అవుతుందని తెలిపారు. గణేష్ ఉత్సవం అంటే ఎంజాయ్ మెంట్ కోసం మాత్రమే చేస్తున్నాం. గణేష్ మండపం వెనకాల పెకడటం, మధ్య సేవించడం కాదని గణేష్ పండుగను భక్తి శ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ శేఖర్, ఎస్సై రాజశేఖర్, ఎంపీడీఓ బ్రహ్మానందం రెడ్డి, వివిధ గ్రామాల వినాయక మండపాల నిర్వాహకులు పాల్గొన్నారు.
ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES