Tuesday, August 19, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్నాగల్ గావ్ లో ఎమ్మెల్యే తోట సుడిగాలి పర్యటన

నాగల్ గావ్ లో ఎమ్మెల్యే తోట సుడిగాలి పర్యటన

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని నాగల్ గావ్ గ్రామం లో పంట నష్టం జరిగిన ప్రాంతాలో  ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు మంగళవారం నాడు సందర్శించారు. ఈ సందర్భంగా ఇటీవలే గత ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నాగుల్ గావ్ గ్రామం నాకు వెళ్లే రోడ్డును, జరిగిన పంట నష్టం వివారాలను తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో రైతుల వ్యవసాయ భూములలో సందర్శన చేసి పరిశీలించారు. గ్రామంలో వర్షానికి బురదమయం కావడంతో రోడ్డును వెంటనే మరమ్మత్తులు చేయాలని సంబంధిత అధికారులను సూచించారు. ద్వంసం మైన రోడ్లను వెను వెంటనే గుర్తించి వాటికి మరమ్మత్తులు చేయించాలని అధికారులకు ఆదేశించారు. జరిగిన పంట నష్టం వివరాలను త్వరలో పరిశీలించి ఒక్క రైతుకు కూడా నష్టం వాటిల్లకుండా పంటల నష్ట వివరాలను పై అధికారులకు అందించాలని మండల వ్యవసాయ అధికారిని మహేశ్వరి ని ఆదేశించారు.

వెంటనే నష్టపరిహారాన్ని అందించే విధంగా ప్రభుత్వం అధికారులతో మాట్లాడీ త్వరలో రైతులకు నష్టపరిహారం అందే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామంలో పాత ఇండ్లలో ఉంటున్న వారివి వర్షం దాటికి ఇండ్లు కూలిపోతే వారికి గుర్తించి వెంటనే ఇందిరమ్మ పథకంలో గృహ నిర్మాణలు చేసుకునేందుకు నూతనంగా ఇండ్లు మంజూరు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. అనంతరం గ్రామంలోని వీరేశం అని రైతుతో ఎమ్మెల్యే మాట్లాడారు.

నీకు ఎంత భూమి ఉందని , అందులోఎంత పంటనష్టం జరిగిందని,  రైతుతో అడుగగా తనకున్న నాలుగు ఎకరాల భూమిలో రెండు ఎకరాలు మామిడి తోట ఉందని మామిడి తోటలో మొత్తం నీళ్లు నిండిందని , రాయ దశలో ఉన్న చేతికి వచ్చిన సోయా పంట  భూమిలో భారీ వర్షానికి నీరు నిలబడిందని పంట నష్టం జరుగుతుందని దిగుబడి తగ్గుతుందని రైతు ఎమ్మెల్యే కు తెలియ చేసారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు ఎంపీడీవో శ్రీనివాస్, ఎమ్మార్వో మారుతి, మండల వ్యవసాయ అధికారిని మహేశ్వరి, ఎస్సై నవీన్ చంద్ర,  గ్రామస్తులు బాబు పటేల్, అనిల్ కుమార్, పద్మశాలి వీరేశం, అశోక్ పటేల్ , మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సతీష్ పటేల్ , రాములు సెట్,  సాయా గౌడ్ , ఏఈఓ సతీష్, ఎఫ్ ఏ బాబు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad