Wednesday, October 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రైతు సంఘం రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయండి

రైతు సంఘం రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయండి

- Advertisement -

అఖిల భారత ఐక్య రైతు సంఘం తొర్రూరు డివిజన్ ప్రధాన కార్యదర్శి జక్కుల యాకయ్య
నవతెలంగాణ – నెల్లికుదురు 

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం ఎదుక్కుంటున్న అనేక సమస్యలపై నిరంతరం పోరాడుతున్న అఖిలభారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర ప్రథమ మహాసభ లు జయప్రదం చేయాలని ఆ సంఘం తొర్రూర్ డివిజన్ ప్రధాన కార్యదర్శి జక్కుల యాకయ్య పిలుపునిచ్చారు.  మండలంలోని మేష రాజు పల్లి గ్రామంలో ని అంబేద్కర్ విగ్రహం ఎదురుగా రాష్ట్ర మహాసభల పోస్టర్ ను మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగస్టు 25, 26 తేదీలలో రాష్ట్ర మహాసభలు జిల్లా కేంద్రంలోని నిర్వహిస్తున్నామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా  వేలాది సభ్యత్వం కలిగిన అఖిలభారత ఐక్య రైతు సంఘం ఆల్ ఇండియా కమిటీ పిలుపు మేరకు జరుగుతున్న మహాసభలలో రైతాంగం పట్ల కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చూస్తున్న సవతి తల్లి ప్రేమను చర్చించి భవిష్యత్తు పోరాట కర్తవ్యాలను చేపట్టనున్నమని తెలిపారు.

రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యంగా నేడు యూరియా తీవ్రమైన కొరత, బ్యాంకులు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రుణాలు ఇవ్వకపోవడం, రైతు పoడించిన పంటకు గిట్టుబాటు ధర చట్టం చేస్తానన్న మోడీ ప్రభుత్వం హామీ బుట్ట రాకలు కావడం, వ్యవసాయ మార్కెట్ల చట్ట సవరణ ముసాయిదాలు తిరస్కరిస్తూ అనేక ఇతర కీలక అంశాలపై చర్చించనున్నామని తెలిపారు. సుమారు 30 జిల్లాల నుండి ఎంపిక చేయబడిన ప్రతినిధులు హాజరయి ఈ మహాసభలకు 25న బహిరంగ సభ 26న మహాసభలు జరుగుతున్నాయని అన్నారు. ఈ మహాసభలకు మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్, మాజీ చీఫ్ జడ్జి చంద్రకుమార్, రైతు సంఘం ఆలిండియా కన్వీనర్ విమల్ త్రివేది సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించనున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు దొడ్డ కేశవులు, రవీందర్,ఐలయ్య సాయిలు,కేదారి, శ్రీనివాస రెడీ,సోమయ్య, మల్లయ్య సాయిలు వెంకన్న యాకయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -