సీఐటీయూ జిల్లా కార్యదర్శి అన్నమొల్ల కిరణ్
నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
ఆశా వర్కర్లకు జూలై నెల పారితోషికాలు వెంటనే చెల్లించాలని ఆగస్టు నెల పారితోషికాలు ఆలస్యం చేయకుండా గతంలో చెల్లించినట్లు సకాలంలో చెల్లించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి అన్నమొల్ల కిరణ్ అన్నారు. ఈ విషయమై మంగళవారం డీఎంహెచ్ఓ కార్యాలయంలో ఆశ వర్కర్స్ యూనియన్ ఆశాలతో కలిసి వినతిపత్రం అందజేశారు. ఫిక్సిడ్ వేతనం రూ.1 వేలు ఇతర పెండింగ్ సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పనిచేస్తున్న ఆశా వర్కర్లకు నేటికి జూలై నెల పారితోషికాలు రాలేదని, నేటికీ పారితోషికాలు రాకపోవడంతో ఆశా వర్కర్లు అనేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. గతంలో ఉన్న అధికారులు ఆశా వర్కర్ల పారితోషికాలను ప్రతి నెల ముగింపు లోపు చెల్లించేవారని కానీ ఇప్పుడు ఆశా వర్కర్లకు పారితోషికాలు గతంలో చెల్లించినట్లు సకాలంలో రావడం లేదన్నారు. దీంతో ఆశా వర్కర్లు అనేక ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందన్నారు.
కావున జూలై నెల పారితోషికాలు వెంటనే చెల్లించాలని, భవిష్యత్తులో ఈ విధంగా ఆలస్యం జరగకుండా ప్రతి నెల ముగింపు లోపు చెల్లించాలని, ఆగస్టు నెల పారితోషికాలు సకాలంలో చెల్లించాలని కోరారు. గతంలో ఇచ్చిన హామీ ప్రకారం ఆశాలకు ఇన్సూరెన్స్ రూ.50 లక్షలు చెల్లిస్తూ వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని, గతంలో ఇచ్చిన హామీ ప్రకారం ఆశాలకు మట్టి ఖర్చులు రూ.50 వేలు చెల్లిస్తూ వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలన్నారు. డిసెంబర్ 10న ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి ఆదివారం, పండుగలకు సెలవులు నిర్ణయిస్తూ వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ.5 లక్షలు చెల్లించాలని ఇస్తున్న పారితోషికాల్లో సగం పెన్షన్ నిర్ణయించాలన్నారు. ఆశాలకు ప్రతి సంవత్సరం 20 రోజులు వేతనంతో కూడిన క్యాజువల్ సెలవులు ఇవ్వాలని 6 నెలలు వేతనంతో కూడిన మెడికల్ సెలవులు ఇవ్వాలన్నారు. గత ప్రభుత్వ హామీ ప్రకారం ప్రసూతి సెలవులు కల్పిస్తూ వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని అన్నారు. ఆశాలు చేస్తున్న పారితోషికం లేని పనులన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో ఆశ యూనియన్ జిల్లా కార్యదర్శి సుజాత, లక్ష్మీ, హారిక ఉన్నారు.
ఆశాలకు జూలై నెల పారితోషికాలు చెల్లించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES