టాస్క్ ఫోర్స్ టీం తనిఖీ
మండల ప్రత్యేక అధికారి మరియన్న, తహశీల్దారు చందా నరేష్
మండల వ్యవసాయ అధికారి ఎస్కే యాస్మిన్
నవతెలంగాణ – నెల్లికుదురు
ఎరువులను అధిక ధరలకు అమ్మినట్లయితే వారిపై కఠిన చర్య తీసుకుని వారి లైసెన్సును రద్దు చేస్తామని టాస్క్ ఫోర్స్ అధికారులు మండల ప్రత్యేక అధికారి మరియాన్న తాసిల్దార్ చందా నరేష్ మండల వ్యవసాయ అధికారి యాస్మిన్ ఎరువుల డీలర్లను హెచ్చరించినట్లు తెలిపారు. మండలంలోని టాస్క్ ఫోర్స్ టీమ్ ఆధ్వర్యంలో మండలం లో నీ పలు ఫెర్టిలైజర్ షాపు లను తనకి నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ను ఆగ్రో రైతు సేవా కేంద్రాలను తనిఖీ చేయడం జరిగింది. ఈ తనిఖీ లో భాగంగా ఎరువుల నిల్వలను,ఈ పాస్ మెషిన్ లో గల స్టాక్ వివరాలు మరియు స్టాక్ రిజిస్టర్ లను పరిశీలించడం జరిగింది.
ఈ తనిఖీ లో ఎరువుల డీలర్స్ ఎమ్మార్పీ రేటుకే ఎరువుల ను రైతులకు విక్రయించాలని ఎరువులను అధిక ధరల కు అమ్మిన కృతిమ కొరత సృష్టించినా సంబంధిత డీలర్స్ పైన కఠిన చర్యలు తీసుకోవడం జరగుతుందని అన్నారు. వారి ఫెర్టిలైజర్ లైసెన్స్ ను రద్దు చేయడం జరుగుతుందని హెచ్చరించడం జరిగిందీ అని తెలిపారు. ఫెర్టిలైజర్ డీలర్ లు షాపు ముందు స్టాక్ బోర్డు మరియు . ధరల బోర్డు పెట్టాలని సూచించడం. రైతులు అవసరం మేరకు యూరియా ఎరువు ను వాడాలని అధికముగా వాడటం వల్ల భూ సారం దెబ్బతిని భవిష్యత్తు కాలంలో పంట దిగుబడి తగ్గే అవకాశం ఉందని ఆదే విధంగా వాతావరణం కలుషితం అవుతుందని సూచించడం జరిగింది. రైతులు నానో యూరియా వాడటం వల్ల పర్యావరణానికి మేలు చేస్తుందని పంటకి లాభసాటి గా ఉంటుందని సూచించారు. మండలం లోని రైతులకు కావలసిన యూరియా అందుబాటులో ఉంచుతామని రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించడం జరిగింది.
ఎరువులను అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES