నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయం భువనగిరి పాఠశాలలో అంగరంగ వైభవంగా 54వ కేవీఎస్ నేషనల్ యోగా స్పోర్ట్స్ మీట్ – 2025 ను జిల్లా కలెక్టర్, విద్యాలయ చైర్మన్ హనుమంతరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ ఎన్ చంద్రమౌళి మాట్లాడుతూ 54వ కేవీఎస్ నేషనల్ యోగా స్పోర్ట్స్ మీట్ – 2025 పోటీలు 19 ఆగస్టు నుంచి 23 ఆగస్టు వరకు5 రోజుల పాటు జరుగుతాయనీ, దేశంలోని వివిధ ప్రాంతాల నుండి విద్యార్థులు ఈ క్రీడల్లో పాల్గొనబోతున్నారు” అని తెలిపారు.
కేంద్రియ విద్యాలయ సంఘటన్ యొక్క 25 రీజియన్ల నుండి 350 మంది విద్యార్థులు, 50 మంది ఎస్కార్ట్ టీచర్స్, 10 మంది జడ్జీలు ఈ క్రీడల్లో పాల్గొంటారని, కేవీఎస్ రీజినల్ ఆఫీస్ హైదరాబాద్ నుండి వచ్చిన అధికారుల బృందం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగుతోందనీ, ప్రారంభ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది హాజరై, కార్యక్రమాన్ని విజయవంతంగా ప్రారంభించినట్లు తెలిపారు.
నేషనల్ యోగ స్పోర్ట్స్ మీట్ ను ప్రారంభించిన కలెక్టర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES