Saturday, October 4, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా బికుమాండ్ల ముత్యాలు వర్ధంతి వేడుకలు..

ఘనంగా బికుమాండ్ల ముత్యాలు వర్ధంతి వేడుకలు..

- Advertisement -

నవతెలంగాణ – వెల్దండ
వెల్దండ  గ్రామ మొదటి సర్పంచ్ బికమాండ్ల ముత్యాలు 52వ వర్ధంతి వేడుకలను మంగళవారం మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ కార్యాలయంలో ముత్యాలు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం మాజీ సర్పంచ్ భూపతి రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు,  ప్రజలు,  అభిమానులు,  విద్యార్థులు ముత్యాలు సమాధి వద్దకు వెళ్లి నివాళులర్పించారు. అనంతరం  ముత్యాల  విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన ఆత్మకు శాంతి కలగాలని కొద్దిసేపు మౌనం పాటించారు . ఈ కార్యక్రమంలో  ఆర్య వైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు బచ్చు రామకృష్ణ, ఎన్నo విజేందర్రెడ్డి, అంజన్ రెడ్డి, కృష్ణారెడ్డి, వజ్ర లింగం, ఆంజనేయులు, రాజయ్య,,  కృష్ణ, శ్రీను, పలువురు నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -