నవతెలంగాణ-పెద్దవంగర
యూరియా కోసం రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మండల వ్యవసాయ అధికారి గుగులోత్ స్వామి నాయక్ అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఈ ఖరీఫ్ సీజన్లో 2200 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా అందులో ఇప్పటివరకు 720 మెట్లు యూరియా సరఫరా చేశామని తెలిపారు. నేడు మరో 40 మెట్రిక్ టన్నుల యూరియా వస్తుందన్నారు. రాబోయే పది రోజుల్లోగా రైతుల అవసరం మేరకు యూరియా అందిస్తామని పేర్కొన్నారు. మోతాదుకు మించి యూరియా అధికంగా వాడడం వలన అనేక అనర్ధాలకు దారితీస్తుందన్నారు.
యూరియా ను అవసరానికి మించి వాడితే భూమి నిస్సారం అవుతుందన్నారు. యూరియా అతిగా వాడితే మొక్కలు పేలుసు బారి చీడ పీడల పెరుగుతుందని తెలిపారు. నెలలో ఉండే పంటలకు మేలు చేసే సూక్ష్మ జీవులు తగ్గిపోతాయన్నారు. నానో యూరియా రైతులకు చాలా మేలు జరుగుతుందన్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడులు సాధించవచ్చని చెప్పారు. నానో యూరియా మొక్కలలో పచ్చదనం, చురుకైన పెరుగుదల, పంట అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని రైతులు నానో యూరియా వినియోగాన్ని పెంచుకోవాలని సూచించారు.