నవతెలంగాణ – ధర్మసాగర్
మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలకు 1978 -1979 బ్యాచ్కు చెందిన 10వ తరగతి విద్యార్థులు ఆరున్నర ఫీట్ల స్టీల్ బీరువాను ధర్మ సాగర్ పాఠశాలకు మంగళవారం బహుకరించి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా వారు గత 47 సంవత్సరాల క్రితం తాము పాఠశాలలో చదువుకున్న ప్రాంతాన్ని నడయాడుతూ,తమ పాఠశాల రోజులను,తమ గురువులను,తమ స్నేహితులను గుర్తు చేసుకున్నారు. ఇలా పాఠశాలకు ఇలా చేయడం చాలా సంతోషకరంగా ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆ బ్యాచ్కు చెందిన విద్యార్థులు సుదర్శన్ రెడ్డి,రమేష్,దయాకర్,సామిల్,జయ ప్రకాష్, ఈశ్వర్, రామమూర్తి,శనగం, బుచ్చిమల్లు,చింత శోభ లతోపాటు పాఠశాల ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు ధర్మ ప్రకాష్, ఉపాధ్యాయులు కవిత,సురేష్,కిరణ్మయి, రామకృష్ణ,ప్రసన్న,రమ్యశ్రీ,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
పాఠశాలకు పూర్వ విద్యార్థుల ఔదార్యం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES