వి హెచ్ పి ఎస్ మండల కమిటీ ఎన్నిక
విహెచ్ పిఎస్ జిల్లా అధ్యక్షుడు ఎండి పాషా
నవతెలంగాణ – నెల్లికుదురు
చలో హైదరాబాద్ సెప్టెంబర్ 9న నిర్వహించే వీకలాంగుల చేయూత పెన్షన్ దార్ల మహా గర్జన సభను విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎండి పాషా అన్నారు. మండల కేంద్రంలోని మంగళవారం విశ్రాంతి భవనంలో వికలాంగుల సమావేశం చెడుపాక లక్ష్మణ్ ఆధ్వర్యంలో నిర్వహించి నూతన మండల కమిటీని ఎన్నుకునే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ పిలుపుమేరకు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వికలాంగులకు 4000 నుండి 6000 వృద్ధులకు వితంతువులకు మరియు చేయుత పెన్షన్ దారులకు 2000 నుండి 4000 పెంచాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 09 చలో హైదరాబాద్ వికలాంగుల చేయూత పెన్షన్ దారుల మహా గర్జన సభను విజయవంతం చేయడానికి మండలంలోని పెన్షన్ దారులు అందరూ భారీగా రావాలని కోరారు.
ఆగస్టు 29 న తొర్రూరు మండల కేంద్రంలో జరగబోయే సన్నాహక సదస్సును విజయవంతం చేయాలని పిలుపునిచ్చినట్లు తెలిపారు, అనంతరం వీ హెచ్ పి ఎస్ మండల అధ్యక్షులుగా : బండారి సారంగం ఉపాధ్యక్షులుగా : ముసుపట్ల జ్యోతి ఉపాధ్యక్షులు : పులి హనుమంతు అధికార ప్రతినిధి: మార్క రాము. ప్రధాన కార్యదర్శి : జక్కిరెడ్డి ప్రభాకర్ ప్రచార కార్యదర్శి : పిడుగు హైమ సహాయ కార్యదర్శి: గుగులోతు వెంకన్న. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా కో ఇన్చార్జి పోలేపాక ప్రవీణ్ మాదిగ, మండల అధ్యక్షులు తుల వెంకన్న, ఇనుగుర్తి ఎమ్మార్పీఎస్ కో కన్వీనర్ చేడుపాక యాకన్న , చాలుగా అశోక్, బ త్తి పట్ల వెంకన్న,భక్తి పట్ల బిక్షం, బి యాకూబ్, సలుగు ఐలయ్య, ఆకుల రాములు, ఎండి ఖలీల్ తదితరులు పాల్గొన్నారు.
చలో హైదరాబాద్ మహా గర్జన సభను విజయవంతం చేయండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES