మౌళి తనుజ్, శివానీ నాగరం లీడ్ రోల్స్‌లో నటిస్తున్న మూవీ ‘లిటిల్ హార్ట్స్’. ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్ పై దర్శకుడు సాయి మార్తాండ్ రూపొందించారు. డైరెక్టర్ ఆదిత్య హాసన్ దీనికి నిర్మాత. ఈ సినిమా కంటెంట్ నచ్చి నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి సెప్టెంబర్ 12న థియేట్రికల్ రిలీజ్‌కు తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్ర టీజర్‌ను డైరెక్టర్ అనిల్ రావిపూడి రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ సాయి మార్తాండ్ మాట్లాడుతూ, ‘సినిమా చాలా బాగా వచ్చింది. థియేటర్స్‌లో బాగా ఎంజారు చేస్తారు. మంచి ప్రయత్నం చేశామని నమ్మకంతో మేమంతా ఉన్నాం’ అని అన్నారు.
‘ఈ సినిమా చూసి మీరంతా థియేటర్స్‌లో కడుపునొప్పి పుట్టేలా నవ్వితే వాళ్లకు కడుపునొప్పి తగ్గేందుకు మెడిసిన్స్ ఫ్రీగా ఇస్తాం (నవ్వుతూ)’ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి చెప్పారు.
ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ బన్నీ వాస్ మాట్లాడుతూ, ‘ఈ సినిమాను ఇప్పటికి మూడుసార్లు చూశాను. మిమ్మల్ని థియేటర్స్‌లో నవ్వించడంలో ఎక్కడా ఫెయిల్ కాదు. ఇంటర్ చదివిన పిల్లలు ఉన్న ప్రతి పేరెంట్ చూడాల్సిన చిత్రమిది. మీ పిల్లాడు బయట ఏం చేస్తున్నాడో మా మూవీలో చూస్తే తెలిసిపోతుంది’ అని అన్నారు.
నవ్వించే ‘లిటిల్ హార్ట్స్’
- Advertisement -
- Advertisement -