108 వాహనాలు తనిఖీ చెసిన జిల్లా వైద్యాధికారి మధుసూదన్
నవతెలంగాణ – మల్హర్ రావు.
అత్యవసర వైద్య సేవల సమయాల్లో 108 సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు సేవలందించాలని భూపాలపల్లి జిల్లా వైద్యాధికారి మధుసూదన్ ఆదేశించారు.మంగళవారం మండల కేంద్రమైన తాడిచెర్ల,మహమత్తారం మండల కేంద్రంలో ఉన్న 108 వాహనాలను ఆకస్మికంగా ఆయన తనిఖీలు చేపట్టారు.ఈ సందర్భంగా 108 వాహనాల్లో ఉన్న మెడికల్ ఈక్యుమెంట్స్,వర్కింగ్ కండిషన్,మెడికల్ స్టాక్ వెరిఫై చేసి,రికార్డ్స్ అప్డేట్ చెక్ చేసినట్లుగా తెలిపారు.వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించి,పలు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో 108 వాహనాల జిల్లా మేనేజర్ మెరుగు నరేష్ యాదవ్,రేగొండ మెడికల్ అధికారి హిమబిందు, ఎంసిహెచ్ఓ ప్రోగ్రాం అధికారి శ్రీదేవి,108 సిబ్బంది పాల్గొన్నారు
అత్యవసర వైద్య సేవలపై నిర్లక్ష్యం చేయొద్దు.
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES