‘ప్రస్తుతం మన దేశంలో విద్య పరిస్థితి ఎలా ఉంది?, విద్యా వ్యవస్థలు ఎలా మరిపోతున్నాయి అనే వాటి మీద అధ్యయనం చేసి నారాయణమూర్తి తీసిన చిత్రం ‘యూనివర్శిటీ పేపర్ లీక్’ అని హాస్యనటుడు బ్రహ్మానందం అన్నారు.
నటుడు, దర్శకుడు, నిర్మాత ఆర్.నారాయణ మూర్తి నిర్మించిన చిత్రం ‘యూనివర్శిటీ పేపర్ లీక్’.
ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా వీక్షించిన బ్రహ్మానందం మీడియాతో మాట్లాడుతూ,’ఈ సినిమాలో అద్భుతమైన ఎమోషన్ ఉంది. అలాగే ఎంత దారుణంగా హ్యూమన్ ఎమోషన్‌తో ఈ సొసైటీ ఆడుకుంటుందో కూడా చూడొచ్చు. హాయిగా తలరా స్నానం చేసివచ్చి నేత చీర కట్టుకున్న స్రీలా ఉన్న సినిమా ఇది. ఇందులో నిజాలుం టాయి. బూతులు ఉండవు.. జీవితపు లోతులు ఉంటాయి. ఇందులోని కొన్ని డైలాగ్స్ వింటే హృదయం కదలిపోయింది. ఈ చిత్రాన్ని అందరూ చూడాలి. చూసి అర్థం చేసుకోవాలి’ అని అన్నారు.
‘ఇంత బిజీలో కూడా నా సినిమా చూసి, నన్ను ఆశీర్వదించి, నాపై ప్రేమను చూపిస్తున్న బ్రహ్మానందంకి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఈ సినిమాను ఈనెల 22న రిలీజ్ చేస్తున్నాను. మీరు చూడండి. ఏమాత్రం బాగున్నా ఆదరించండి. మరిన్ని సినిమాలు తీసే శక్తిని ప్రసాదించండి’ అని ఆర్.నారాయణ మూర్తి తెలిపారు.
నేటి మన విద్యావ్యవస్థకు ప్రతిబింబం
- Advertisement -
- Advertisement -