నవతెలంగాణ-హైదరాబాద్: భారత్ పై విధించిన అదనపు సుంకాలపై యూఎస్ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు చేసింది. రష్యా మీద ఒత్తిడి పెంచడానికి భారత్ పై అదనపు టారిఫ్‌లు విధించామని వైట్ హోస్ ప్రెస్ సెక్రటరీ కరోలినా లివేట్ పేర్కొంది. రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం త్వరగా ముగియాలని ప్రజల నుంచి యూఎస్ పై ఒత్తిడి పెరుగుతోందని, ఈక్రమంలో రష్యా మీద ఒత్తిడి పెంచేందుకు మరో ప్రత్యామ్నాయం లేదని ఆమె ఓ ప్రకటనలో వెల్లడించింది.
‘రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య ఏండ్ల తరబడి సాగుతున్న యుద్దానికి ముగింపు పలకాలని..ప్రజల నుంచి యూఎస్ ప్రెసిడెంట్ పై ఒత్తిడి పెరుగుతోందని, దీంతో ఇండియాతో పాటు పలు దేశాలపై సుంకాలు విధించాం. యుద్ధ విరమణకు కోసం, మరో నెలరోజుల్లో శాంతి చర్చల కోసం వేచి చూస్తామని’ అని అన్నారు.
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూ..భారత్ ఆ దేశానికి ఆర్థికంగా సహకారం అందిస్తుందని ట్రంప్ ఆరోపించిన విషయం తెలిసిందే. దీంతో యూఎస్ కు వచ్చే భారత్ దిగుమతులపై 50శాతం టారిప్‌లు విధించారు. ఇటీవల అలాస్కాలో వేదికగా పుతిన్-ట్రంప్ భేటీ జరిగిన విషయం తెలిసిందే.ఈ సమాశంలో యుద్ధ ముగింపు సంబంధించి ఏకాభిప్రాయం కుదరలేదు.