అవగాహన కల్పించడంలో భారత్ గ్యాస్ ఏజెన్సీ నిర్లక్ష్యం
పాఠకుల అవగాహన కోసం ఈ కథనం
నవతెలంగాణ – అచ్చంపేట
వంటగ్యాస్ వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించవలసిన పట్టణంలోని భారత్ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. అన్ని వస్తువులకు కాలం (ఎక్స్ ప్రైరి ) గడువు ఉన్నట్లే.. గ్యాస్ సిలిండర్ బండ కు కాలం గడువు ఉంటుంది. నవతెలంగాణ పాఠకులకు, మహిళలకు ప్రతి ఒక్కరి అవగాహన కోసం ఈ కథనం ప్రత్యేకం.
భవిష్యత్తులో భద్రత కోసం వివిధ గ్యాస్ కంపెనీలు సిలిండర్ల పైన గడువు తేదీలను ముద్రించాయి. భారత్ గ్యాస్ ఏజెన్సీ మేనేజర్ గోపాల్ గురువారం నవతెలంగాణకు వివరాలు వెల్లడించారు. ప్రతి రోజు వంట చేసుకునే ప్రతి కుటుంబం వంట గ్యాస్ సిలిండర్ ను వినియోస్తున్నారు. సిలిండర్ పై భాగం గుండ్రటి హ్యాండిల్ ఉంటుంది. దీన్ని లోపల భాగంలో ప్రత్యేకమైన అంకెల కోడ్ ఉంటుంది.
ఏ -23 , బి -24 , సి -25 , డి -26 లాంటి నెంబర్లు ముద్రించి ఉంటాయి. పాఠకులు, ప్రతి వినియోగదారులు, ప్రజలు కచ్చితంగా గమనించాలి. ఏబిసిడి లు నెలలను గుర్తిస్తాయి. రెండు అంకెలు సంవత్సరాన్ని సూచిస్తాయి. 12 నెలలను నాలుగు భాగాలుగా విభజించారు. ఉదాహరణకు ఏ – అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ , బి -అంటే ఏప్రిల్, మే, జూన్ , సి – అంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. , డి అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలుగా గుర్తించుకోవాలి. రెండు అంకెలు సంవత్సరాన్ని సూచిస్తాయి. ఉదాహరణకు బి- 26 సిలిండర్ పై ఉంది అనుకుంటే..! ఏప్రిల్ నెలలో 2026 లో సిలిండర్ గడువు ముగిసింది అని అర్థం. బి -30 ఉంది అంటే 2030లో గడువు ముగుస్తుంది అని అర్థం చేసుకోవాలి.
ప్రతి వినియోగదారులు ఇంటికి వచ్చినప్పుడు సిలిండర్ల పైన ఉన్న ముద్రలను గమనిస్తుండాలి. గడువు ముగిసినట్లు గమనిస్తే వెంటనే గ్యాస్ కంపెనీ వారికి సమాచారం ఇవ్వాలి. సిలిండర్ ను వెనక్కి ఇచ్చి మరొకటి తీసుకొచ్చుకోవాలి.
ప్రజలకు అవగాహన కల్పించడంలో భారత్ గ్యాస్ ఏజెన్సీ నిర్లక్ష్యం
భవిష్యత్తులో భద్రత కోసం గ్యాస్ కంపెనీలు సిలిండర్లపై గడువు తేదీలను ముద్రిస్తాయి. అచ్చంపేటలో భారత్ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు తమకు వచ్చిన లాభాల పై ఉన్న శ్రద్ధ చూపుతున్నారని ప్రజలకు అవగాహన కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని గ్యాస్ వినియోదారులు బహిర్గతంగా ఆరోపిస్తున్నారు. పట్టించుకోవాల్సిన సివిల్ సప్లై అధికారులు చూచి చూడనట్లు వ్యవహారిస్తున్నారు. గడువు తేదీల పై ప్రజలకు అవగాహన కల్పించవలసిన అవసరం ఎంతైనా ఉంది.
కాలం చెల్లిన సిలిండర్ కస్టమర్లకు ఇచ్చే అవకాశం ఉండదు : గోపాల్, భారత్ గ్యాస్ ఏజెన్సీ మేనేజర్ అచ్చంపేట
గ్యాస్ సిలిండర్ పై ఉన్న కాలం గడువు ముద్రల పై ప్రజలకు అవగాహన ఉండాలి. ప్రతి వినియోగదారుడు గ్యాస్ సిలిండర్ ను 4, నెలలు వినియోగించడం జరుగుతుంది. అయిపోగానే ఖాళీ సిలిండర్ మా దగ్గరికి వస్తుంది . మేము గడువు తేదీలను గమనించి మళ్ళీ సిలిండర్లు నింపడానికి కంపెనీకి పంపించడం జరుగుతుంది. అక్కడ వారు సిలిండర్ల పై ఉన్న కాలం గడువు తేదీలను గమనించడం జరుగుతుంది. ఒకవేళ కాలం గడువు తీరిన సిలిండర్ కనిపిస్తే వెంటనే దాన్ని పక్కకు పెడుతారు. కస్టమర్ కు వచ్చే అవకాశం ఉండదు.



