నవతెలంగాణ-అచ్చంపేట
హై రిస్క్ డెలివరీ కేసును అచ్చంపేట కేర్ హాస్పిటల్ వైద్యులు గురువారం సురక్షితంగా పూర్తి చేశారు. బల్మూర్ మండలం, పోలిశెటిపల్లి గ్రామానికి చెందిన ఓ గర్భిణి బరువు 108 కిలోలు , బీపీ 170/130 వంటి తీవ్రమైన హైపర్ టెన్షన్, బి ఏం ఐ – 48 వంటి ఒబేసిటీ, G5P2L2A2, గతంలో 2 సిజేరియన్ సెక్షన్స్ మరియు 1 హిస్టోటమీ హిస్టరీతో 37 వారాల గర్భధారణ తో గురువారం పట్టణంలోని కేర్ ఆస్పత్రిలో అడ్మిషన్ అయ్యారు. డా. అమ్రీన్ తన నైపుణ్యంతో ఎలెక్టివ్ LSCS + బైలేటరల్ ట్యూబెక్టమీ విజయవంతంగా నిర్వహించారు. ఆపరేషన్ సమయంలో గర్భాశయం ముందు భాగంలో ఉన్న డెన్స్ ఓమెంటల్ అడ్హీషన్స్‌ను సురక్షితంగా తొలగించి , 3.5 కిలోల బరువుతో ఆరోగ్యవంతమైన ఆడ శిశువు బయటికి తిశారు.
తల్లి, బిడ్డ ఇద్దరూ పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని డా. అమ్రీన్ వెల్లడించారు.ఈ సర్జరీలో అనస్తీషియా వైద్యులు డా. గౌతమ్ (Anesthesiologist), OT అసిస్టెంట్ బాలూ, సిస్టర్స్ జకీరా, శివలీల, ల్యాబ్ అసిస్టెంట్ సోహెల్ మరియు అచ్చంపేట కేర్ హాస్పిటల్ సిబ్బంది అందరూ సమిష్టిగా పాల్గొని విజయవంతంగా పూర్తి చేశారు.
ఏలాంటి హై రిస్క్ డెలివరీలు అయిన అచ్చంపేట కేర్ ఆస్పత్రిలో సురక్షితంగా చేయడం జరుగుతుందని నిరూపించారు. ఆధునిక సదుపాయాలతో ఉత్తమ వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని నల్లమల్ల ప్రాంత ప్రజలకు నమ్మకం కలిగిస్తున్నారు.



