నవతెలంగాణ – అశ్వారావుపేట
నకిలీ నోట్లు బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు యత్నించిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ టీ యయాతీ రాజు తెలిపిన వివరాల ప్రకారం, ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరుకు చెందిన పాలకుర్తి అంకయ్య పాల్ వారపు సంతల్లో ఫర్నిచర్ విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు.
ఈ నెల 16 వ తేదీన అశ్వారావుపేట లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) శాఖలో తన వద్ద ఉన్న రూ.14,500 లు నగదును డిపాజిట్ చేశాడు. మొత్తం రూ.500 నోట్లు గా ఉన్న ఈ నగదు లో 11 నకిలీ నోట్లు ఉన్నట్లు క్యాషియర్ గుర్తించి వెంటనే బ్యాంక్ మేనేజర్ దృష్టికి తీసుకెళ్లారు.
దీంతో బ్యాంక్ మేనేజర్ రాజేంద్ర నాయక్ స్థానిక పోలీస్ స్టేషన్లో గురువారం లిఖిత పూర్వక ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ తెలిపారు.



