సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు కొంగరి వెంకట మావో
నవతెలంగాణ – చేర్యాల
చేర్యాల పట్టణ కేంద్రంలోని పెద్ద చెరువులో మంగళవారం నీట మునుగుతున్న మహిళను గమనించి వెంటనే స్పందించి చెరువులోకి దిగి ఈదుతూ మహిళను కాపాడి గట్టుకు చేర్చి రక్షించిన చేర్యాల పోలీస్ తాండ్ర స్వామి సాహసానికి సీపీఐ(ఎం) సిద్దిపేట జిల్లా కమిటీ సభ్యులు కొంగరి వెంకట మావో సెల్యూట్ చెప్పి అభినందించారు. ఈ సందర్భంగా మంగళవారం పట్టణ కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో తాండ్ర స్వామిని సీపీఐ(ఎం) బృందం శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం కొంగరి వెంకట మావో మాట్లాడుతూ.. తాండ్ర స్వామి ప్రదర్శించిన సాహసం, చొరవ వల్ల ఒక నిండు ప్రాణాన్ని నిలబెట్టగలిగారని ఆయనను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ అనుకోని ఆపద సమయాల్లో స్పందించే విదంగా అలవర్చుకోవాలని యువతకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ వేముల నవీన్,పార్టీ పట్టణ కమిటీ సభ్యులు రాళ్ల బండి భాస్కర్,బోయిని మల్లేశం, తుప్పతిరాజు తదితరులు పాల్గొన్నారు.
పోలీస్ తాండ్ర స్వామి సాహసానికి సెల్యూట్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES