Monday, May 5, 2025
Homeఖమ్మంగాలివాన భీభత్సం.. అన్నదాత ఆగం

గాలివాన భీభత్సం.. అన్నదాత ఆగం

- Advertisement -

నవతెలంగాణ – అశ్వరావుపేట: అకాల గాలివాన బీభత్సం సృష్టించింది. ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులతో కూడిన వర్షం సంభవించడంతో వేడితో అల్లాడుతున్న ప్రజలు కాస్త సేద తీరారు. కాని ఆదివారం వచ్చిన అకాల వర్షానికి వడ్లు పండించే రైతులు ఆగం అయ్యారు. వానతో కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబోసిన ధాన్యం రాశులు తడిసి ముద్దయ్యాయి. అశ్వారావుపేటలో ఈదురు గాలులతో కూడిన వర్షానికి వడ్ల రాసులు తడిసి ముద్దయ్యాయి. దీంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ధాన్యం కుప్పలు తడిసి పోవడంతో, రైతులు తమ పంటను కాపాడుకోవడానికి ప్లాస్టిక్ కవర్లు వంటి వాటిని ఉపయోగించి వర్షం నుంచి ధాన్యాన్ని కాపాడుతున్నారు. కల్లాల్లో ఆర పెట్టిన ధాన్యం తడిసి పోవడంతో ధాన్యం నాణ్యత తగ్గి నష్టం వాటిల్లుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులు ఆరుగాలం కష్టం వృధాగా మారింది. తూకానికి  సిద్ధం చేసిన ధాన్యం తడిసిపోవడంతో రైతులు తల్లడిల్లిపోతున్నారు. ఈ యాసంగి(రబీ)లో మండల వ్యాప్తంగా 1900 ఎకరాల్లో వరి పండించారు అని, ఇప్పటికే 15 శాతం కోతలు కోరారని మండల వ్యవసాయాధికారి శివరాం ప్రసాద్ తెలిపారు. మండలంలో అశ్వారావుపేట, ఊట్లపల్లి, అచ్యుతాపురం, మద్ది కొండ, నారాయణపురంలో 5 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసామని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -