నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ
మంచిర్యాల జిల్లాలో కేంద్రంలో ఆగస్టు 30,31 తేదీలలో జరిగే రాజకీయ శిక్షణ తరగతులను విజయవంతం చేయాలని పి డి.ఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ విద్యార్థులను కోరారు. నిజామాబాద్ నగరంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలో పిడిఎస్యూ ఆధ్వర్యంలో పిడిఎస్యూ రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతుల బ్రోచర్స్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (PDSU) ఈ దేశంలో శాస్ర్తీయ విద్య , కామన్ స్కూల్ విద్యా విధానం కోసం ,విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని 50 సంవత్సరాలుగా పోరాడుతుందని, దేశ విద్యారంగంలో కార్పొరేట్ సంస్కరణలను మరియు విద్యా వ్యతిరేక విధానాలను నూతన జాతీయ విద్య విధానం 2020 లో పొందుపరుస్తూ తీసుకువచ్చారని, తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయొద్దని అన్నారు.
రాష్ట్రంలో విద్యారంగాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ నిర్విన్యం చేస్తుందని , ప్రభుత్వ స్కూల్స్ నుండి యూనివర్సిటీల వరకు రాష్ట్ర బడ్జెట్ లో సరిపడ నిధులు కేటాయించలేక పోవటం వలన అభివృద్ధి కి నోచుకోలేకపోతున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విద్యావ్యతిరేక విధానాలపై సామాజిక సైద్ధాంతిక రాజకీయ చైతన్యాన్ని అందించేందుకు మరియు విద్యారంగ సమస్యలపై భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకొనుటకు ఆగస్టు 30,31 తేదీల్లో మంచిర్యాలలో జరిగే రాజకీయ శిక్షణ తరగతులను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమం లో పి డి ఎస్ యూ నగర నాయకులు మనోజ్,సాయికిరణ్,దుర్గాప్రసాద్, ప్రసాద్,అరవింద్, వంశీ, అనన్య, మౌనిక, శ్రీజ,లావణ్య తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులను విజయవంతం చేయండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES