నవతెలంగాణ -ముధోల్
పేద ప్రజల ఆరోగ్యానికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని మాజీ ఎంపిపి అయిషా అప్రోజ్ ఖాన్ అన్నారు. నియోజకవర్గ కేంద్రమైన ముధోల్ కు చెందిన షేక్ అహ్మద్ ఖురుషి సిఎం సహాయ నిధి కింద మంజూరైన 36వేయిల 500 రుపాయల చెక్కును బుధవారం అందజేశారు. ఈసందర్భంగా మాట్లాడారు. ఆరోగ్య భద్రత కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. సిఎం సహాయ నిధి చెక్కు మంజూరు కు కృషి చేసిన సిఎం రేవంత్ రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎమ్మెల్యే విఠల్ రేడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ మాజీ ఉపాధ్యాక్షుడు ఎజాజుద్దీన్, కాంగ్రెస్ నాయకులు అభిహుస్సేన్,వాకరాజహార్,ఇమ్రాన్ ఖాన్, ఖురిషి, ముజాహిద్ తదితరులు పాల్గొన్నారు.
పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్ద పీట..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES