– ఈఆర్ఓ, బూత్ స్థాయి సూపర్వైజర్లకు శిక్షణ
– తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటరు పాత్ర కీలకమని తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్ అన్నా రు. రాబోయే సాధారణ ఎన్నికల దృష్ట్యా మంగళవారం తెలం గాణ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్, జాయింట్ సీఈఓ లోకేశ్‌కుమార్, అదనపు సీఈఓ సర్ఫారాజ్, జీహెచ్ ఏంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్, మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఆమోరుకుమార్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీశ్‌లతో కలిసి స్వీప్ ఆక్టివిట్సిపై ఈఆర్ఓ లు, బూత్ స్థాయి సూపర్వైజర్లకు ఒక రోజు వర్క్ షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారి వికాస్ రాజ్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటరు పాత్ర ఎంతో కీలకమైనందున అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పనిస రిగా ఓటింగ్‌లో పాల్గొనాలని సూచించారు. త్వరలో జరుగ నున్న సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అర్హులైన ఓటర్లు అందరూ తమ ఓటు హక్కును వినియోగించు కునేలా విస్తృత స్థాయిలో ప్రచార కార్యక్రమాలు నిర్వహిం చాలని తెలిపారు. 2023 అక్టోబర్ 1వ తేదీ నాటికి 18 ఏండ్లు పూర్తి చేసుకుంటున్న వారంతా ఓటరు జాబితాలో తమ పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. బూత్ స్థాయి సూపర్ వైజర్లు, నోడల్ అధికారులు రెసిడెన్షియల్ అసోసియేషన్ వెల్ఫేర్ వారితో సంప్రదించి అపార్ట్ మెంటలలో ఉండే వారిని ఓటు నమోదు చేయాల న్నారు. మార్పులు చేర్పులు చేసే విధంగా ఫామ్-6,7,8 లను సేకరించాలని సూచించారు. ఎన్నికలలో వంద శాతం ఓటు వేసే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ సందర్బంగా వర్క్‌షాప్‌కు హాజరైన వారితో ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ ప్రతిజ్ఞ చేయించారు.