Monday, May 5, 2025
Homeఖమ్మంసీపీఐ(ఎం) సానుభూతి పరుడు వీరయ్య మృతి..

సీపీఐ(ఎం) సానుభూతి పరుడు వీరయ్య మృతి..

- Advertisement -

నివాళులు అర్పించిన జిల్లా నాయకత్వం…
నవతెలంగాణ – అశ్వారావుపేట
: సీపీఐ(ఎం) సానుభూతి పరుడు, అభిమాని, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొక్కెరపాటి పుల్లయ్య మేన బావ కొవ్వాల వీరయ్య(70) వయోభారంతో కూడిన అనారోగ్యంతో శనివారం మృతి చెందాడు. ఈయన అంత్యక్రియలు ఆదివారం అశ్వారావుపేట లో నిర్వహించారు.ఈ విషయం తెలుసుకున్న సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు, రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరం కనకయ్య, రైతు సంఘం జిల్లా అద్యక్షులు అన్నవరం సత్యనారాయణ, జిల్లా కార్యదర్శి వర్గం సభ్యులు పుల్లయ్య, సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య వీరయ్య భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఆయన కుటుంబాన్ని ఓదార్చారు. ఆంద్రప్రదేశ్, వెలేరుపాడు మండలం రుద్రమ కోటకు చెందిన వీరయ్య పుగాకు బోర్డ్ లో పదవీ విరమణ పొంది అశ్వారావుపేట విశ్రాంతి ఉద్యోగిగా స్థిరపడ్డారు. ఈయనకు భార్య, ఇరువురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఈయనకు నివాళులు అర్పించిన వారిలో అశ్వారావుపేట, దమ్మపేట సీపీఐ(ఎం) మండల కార్యదర్శులు మోరంపుడి శ్రీనివాసరావు, సోడెం ప్రసాదరావు, దొడ్డ లక్ష్మినారాయణ, మండల కమిటీ కార్యదర్శివర్గ సభ్యులు మడిపల్లి వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ మండల అద్యక్షులు తుమ్మ రాంబాబు, మిత్రులు ఆళ్ళ నాగేశ్వరరావు, పసుపులేటి ఆదినారాయణ లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -