పెరిగిన కాన్పులు….
అభివృద్ధి పై దృష్టి సారించిన ఎమ్మెల్యే జారే…
జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ చొరవతో సౌకర్యాలు…
డీసీహెచ్ఎస్ రవి బాబు స్పెషల్ ఫోకస్…
నవతెలంగాణ – అశ్వారావుపేట: స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ప్రాధాన్యాలు అయిన విద్యా వైద్యం పై దృష్టి సారించడం తో అశ్వారావుపేట ఏరియా ఆస్పత్రికి మహర్ధశ పట్టుకుంది. దీనికి తోడు జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ చొరవతో ఆస్పత్రిలో సౌకర్యాలు మెరుగు అయ్యాయి. ఆస్పత్రులపై డీసీ హెచ్ఎస్ పర్యవేక్షణ పెంచడంతో వైద్యసిబ్బంది లో చురుకుతనం కనపడుతుంది. ఈ కారణంతో సాదారణ కాన్పులు పెరిగి, సిజేరియన్ సెక్షన్లు తగ్గుముఖం పట్టాయి. దీంతో నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట లోని ఏరియా ఆస్పత్రి సిబ్బంది ని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అభినందించారు. అశ్వారావుపేట ప్రభుత్వ ఆస్పత్రిలో కాన్పులు సంఖ్య గణనీయంగా పెరుగుతున్నాయి.
గతంలో నెలకి పది ఉన్న ప్రసవాలు సంఖ్య నేడు 23కి చేరింది.
ఇందులో పదహారు సాదారణ కాన్పులు కాగా ఏడు సిజేరియన్ సెక్షన్లు అయ్యాయి.గతంలో స్పెషలిస్ట్ వైద్యుల కొరత తీవ్రంగా ఉండే క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లాకు చెందిన మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ వివిధ సందర్భాలలో వైద్యుల కొరత పై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ కు సూచించారు. కలెక్టర్ అదనపు ప్రోత్సాహకాలు ప్రకటించి నోటిఫికేషన్ ఇవ్వవలసిందిగా డీసీహెచ్ఎస్ డాక్టర్ రవిబాబు ని ఆదేశించారు. ప్రోత్సాహకాల తో కూడిన వేతనాలపై ఆకర్షితులైన వివిధ స్పెషలిస్ట్ డాక్టర్లను మారుమూల ప్రాంతాలైన వివిధ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రులలో నియామకాలు చేపట్టారు. ప్రస్తుతం అశ్వారావుపేట ఆస్పత్రిలో ఇద్దరు ప్రసూతి వైద్యులు, ఇద్దరు మత్తు వైద్యులు, ఒక పిల్లల వైద్యుడు, 4 ఎంబిబిఎస్ వైద్యులు ఉన్నారు. స్థానికంగానే ప్రసూతి వైద్యులు, పిల్లల వైద్యులు, మత్తు డాక్టర్లు అందుబాటులో ఉండటం, రోగులకు నాణ్యమైన చికిత్స అందుతుండటంతో ప్రజలు సర్కారు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. ఎప్పటికప్పుడు స్థానిక శాసనసభ్యులు జారే ఆదినారాయణ సహకారం, అధికారుల సమన్వయం, జిల్లా కలెక్టర్ సహకారంతో మౌలిక సదుపాయాల ఏర్పాటు, ఇరవై నాలుగు గంటలు డాక్టర్లు, వైద్య సిబ్బంది, ల్యాబ్ టెస్టు లు, ప్రసవానికి సంబంధించిన మందులు ప్రసూతి వార్డుల్లో అందుబాటులో ఉండటం, ఏసీలు, కూలర్లు ఏర్పాటు చేయడం అన్నీ కలగలిపి ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాలు సంఖ్య పెరిగింది.
భవిష్యత్తులో కూడా పెరిగే అవకాశం ఉంది. విశేషమేమిటంటే ప్రభుత్వ ఆస్పత్రులలో కోత లేకుండా సుఖ ప్రసవాలు సంఖ్య అధికంగా ఉంది. 70 శాతం సాదారణ కాన్పులు అవ్వడం పట్ల రాష్ట్ర టీవీ వీపీ కమిషనర్ అజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, డీసీహెచ్ఎస్ డాక్టర్ రవిబాబు హర్షం వ్యక్తం చేశారు. ప్రయివేటు ఆస్పత్రులతో పోలిస్తే సిజేరియన్ సెక్షన్ సంఖ్య జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రులలో చాలా తక్కువగా ఉంది. సాధారణంగా ప్రైవేటు ఆస్పత్రులలో ఒక కాన్పుకు సుమారు రూ.30 నుండి 40 వేలు ఖర్చు అవుతుంది. ప్రభుత్వ ఆస్పత్రులలో అంకితభావంతో పని చేస్తున్న వైద్య సిబ్బంది, వసతులు మరియు సౌకర్యాలు పెరగడంతో ప్రజలు ప్రభుత్వ ఆస్పత్రుల పట్ల ఆకర్షితులవుతున్నారు. తద్వారా పేద ప్రజలు తమ కాన్పు కి సంబంధించిన స్కానింగ్, రక్త పరీక్షలు, ఆపరేషన్, తదితర ఖర్చుల భారం తగ్గుతుందని, ప్రభుత్వ ఆస్పత్రులలో అందిస్తున్న మెరుగైన సేవల పట్ల పేట ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రి సిబ్బంది సైతం తాము పనిచేస్తున్న ఆస్పత్రులలో కాన్పు చేయించుకోవడానికి మొగ్గు చూపుతున్నారు.
ఏరియా ఆస్పత్రిలో మెరుగైన సేవలు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES