మహాసభలలో ప్రజా సమస్యల పరిష్కారానికే చర్చిస్తాం
సిపిఐ జిల్లా కార్యదర్శి బి విజయ సారథి
నవతెలంగాణ – నెల్లికుదురు
నేటి నుండి మూడు రోజులపాటు ఆగస్టు 20 21 22 మేడ్చల్ జిల్లా గాజుల రామారావు జరుగుతున్న సిపిఐ తెలంగాణ రాష్ట్ర నాలుగవ మహాసభలకు మహబూబాబాద్ జిల్లా నుండి సిపిఐ కార్యదర్శి బి విజయసారథి ఆధ్వర్యంలో 25 మంది ప్రతినిధులు హాజరైనారు. ఈ సందర్భంగా బి విజయ సారధి మాట్లాడుతూ .. ఈ మహాసభలలో రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలపై చర్చించి ఉద్యమాలు చేస్తామన్నారు. రానున్న గ్రామపంచాయతీ ఎంపీటీసీ జడ్పిటిసి మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా కార్యకర్తలను సన్నద్ధం చేస్తామన్నారు.
రానున్న కాలంలో బిజెపి రాష్ట్రానికి విభజన హామీ చట్టంలో ఉన్న బయ్యారంలో ఉక్కు పరిశ్రమ కాజీపేట కోచ్ పరిశ్రమ వాటి కోసం పోరాడుతామన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రం నలులు మూల నుండి 1000 మంది ప్రతినిధులు మహాసభలలో పాల్గొన్నారు అని తెలిపారు. ఈ మహాసభలలో ప్రతినిధులుగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శులు బి అజయ్ సారధి రెడ్డి, నల్లు సుధాకర్ రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కట్టబోయిన శ్రీనివాస్, సిపిఐ నేతలు పెరుగు కుమార్, రేషపల్లి నవీన్, మామిళ్ల సాంబలక్ష్మి, తండ సందీప్, వీరవెల్లి రవి ,వెలుగు శ్రావణ్, కర్నం రాజన్న, మేక వీరన్న, బందు మహేందర్, మారగాని బాలకృష్ణ,సారిక శ్రీనివాస్, జంపాల వెంకన్న ,భైసస్వామి, బానోతు లింగ్య నాయక్, మాలోతు రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర నాల్గవ మహాసభలకు హాజరైన మహబూబాబాద్ జిల్లా ప్రతినిధులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES