Thursday, August 21, 2025
E-PAPER
spot_img
Homeజిల్లాలుతడ్కోల్ ఉపాధ్యాయునిపై పోక్సో కేసు నమోదు 

తడ్కోల్ ఉపాధ్యాయునిపై పోక్సో కేసు నమోదు 

- Advertisement -

ఉపాధ్యాయుడు సస్పెండ్ .. రిమాండ్ 
పోక్సో పై అవగాహన ..మార్పు రాని వైనం 
నవతెలంగాణ – బాన్సువాడ (నసురుల్లాబాద్)

విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై పోక్సో చట్టం కింద మంగళవారం కేసు నమోదైంది. బాన్సువాడ మండలంలోని తాడ్కోల్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాలికలను వేదిస్తున్నాడని, బ్యాడ్ టచ్ చేస్తున్నట్లు బాలికలు ఫిర్యాదు చేయడంతో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు గణపతి రాథోడ్ మ్యాథ్స్ ఉపాధ్యాయుని పై  పొక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేసి, రిమాండ్ కు తరలించినట్లు బాన్సువాడ పోలీసులు వెల్లడించారు. ఈ విషయంపై మండల విద్యాధికారి నాగేశ్వరరావును వివరణ కోరగా.. బాలికల పట్ల అసభ్య ప్రవర్తించడంతో, ఆయనపై కేసు నమోదు చేయడం జరిగిందని, విధుల నుంచి తొలగిస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి రాజు ఉత్తర్వులు వెల్లడించినట్లు ఆయన తెలిపారు.

తల్లిదండ్రుల కంటే ఎక్కువగా సమయం కేటాయించేది విద్యార్థిని ,విద్యార్థులు ఉపాధ్యాయుల వద్దనే. అలాంటి ఉపాధ్యాయులు విద్యార్థులకు చక్కని విద్య బోధించి, భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులే  కీచకులుగా మారుతున్నారు. తమ కన్న బిడ్డల్లాగా చూసుకోవాల్సిన కొంతమంది ఉపాధ్యాయులు, విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ.. వారిని లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కొంతమంది కీచక ఉపాధ్యాయులపై పోక్సో చట్టం కేసు నమోదు చేసి జైలుకు పంపుతున్నప్పటికీ.. గురువుగా పూజించే ఉపాధ్యాయులు వారి పనితీరులో మార్పు జరగడం లేదనే తెలుస్తుంది.

తాజాగా కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా జూన్ నెలలో ప్రభుత్వ ప్రధాన ఉపాధ్యాయులకు పోక్సో చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. అయినా ఉపాధ్యాయుల తీరు మారకపోవడంపై విద్యార్థినిల తల్లిదండ్రులు ఆందోళన గురవుతున్నారు. విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థిని తల్లిదండ్రులు కోరుతున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad