Thursday, August 21, 2025
E-PAPER
spot_img
Homeజిల్లాలుగౌడ సోదరులకు కాటమయ్య కిట్లు పంపిణీ

గౌడ సోదరులకు కాటమయ్య కిట్లు పంపిణీ

- Advertisement -

నవతెలంగాణ – రాయపర్తి
ఈదులు, తాళ్లు ఎక్కి కల్లు గీసే గౌడ సోదరుల కోసం ‘కాటమయ్య రక్ష’ కిట్లను పాలకుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అందించారు. బుధవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే గౌడ సోదరులకు 160 కాటమయ్య కిట్లు పంపిణీ చేసి ఈ విధంగా మాట్లాడారు.. చెట్టు ఎక్కి కల్లు గీసే క్రమంలో చాలాసార్లు ప్రమాదాల బారిన పడి గీత కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారని ప్రమాదాల నివారణకు కాటమయ్య కిట్లను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రమాదాలను నివారించేందుకు ఆధునికతను జోడించి సేఫ్టీ కిట్లను ప్రభుత్వం తయారు చేసి అందిస్తుంది అని విన్నవించారు. గీత కార్మికులు సులువుగా తాటి చెట్లు ఎక్కేలా ఈ కిట్లను రూపొందించారు అని చెప్పారు.

ప్రమాదవశాత్తు తాటి చెట్ల మీద నుంచి కింద పడకుండా ఈ పరికరాల్లో అత్యాధునిక టెక్నాలజీని వినియోగించారు అని వ్యాఖ్యానించారు. ఒక్కో కిట్‌లో మొత్తం 6 పరికరాలు ఉంటాయి అని తాడు, క్లిప్పులు, హ్యాండిల్స్, స్లింగ్ బ్యాగ్, లెగ్ లూప్ వంటివన్నీ వేర్వేరుగా ఉంటాయి అని వివరించారు. ప్రస్తుతం గీత కార్మికులు ఉపయోగిస్తున్న సాంప్రదాయ కిట్ల తరహాలోనే ఈ పరికరాలు ఉంటాయి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట ఎక్సైజ్ సిఐ స్వరూప, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ రవీందర్, కాటమయ్య కిట్ల జిల్లా కోఆర్డినేటర్ బాల్నే వెంకట మల్లయ్య గౌడ్, ఏబిసిడిఓ ఆఫీసర్ శంకరయ్య, బీసీ వెల్ఫేర్ సీనియర్ అసిస్టెంట్ ఆంజనేయులు, గౌడ సంఘం మండల అధ్యక్షుడు పులి సోమయ్య, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హామ్య నాయక్, మండల అధ్యక్షుడు ఈదులకంటి రవీందర్ రెడ్డి, యూత్ మండల అధ్యక్షుడు కోతి కళ్యాణ్ గౌడ్, గౌడ్ సంఘ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad