Thursday, August 21, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యుత్ వైర్లను తాకరాదు..

ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యుత్ వైర్లను తాకరాదు..

- Advertisement -

– విద్యుత్ ఎస్ ఇ శ్రావణ్ కుమార్ 
నవతెలంగాణ –  కామారెడ్డి

విద్యుత్తు వైర్ల లైన్లను ఎట్టి పరిస్థితుల్లోనూ సొంతంగా పైకి ఎత్తడం, తాకడం, మార్గం క్లియర్ చేసేందుకు ప్రయత్నించడం చేయరాదనీ విద్యుత్ కామారెడ్డి ఎస్ ఈ శ్రవణ్ కుమార్ అన్నారు. బుధవారం కామారెడ్డి పట్టణంలో విద్యుత్ వినియోగదారులకు, గణేష్ విగ్రహాల తయారీదారులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏవైనా సమస్యలు ఎదురైతే తక్షణమే సమీప విద్యుత్ అధికారులను సంప్రదించాలనీ,  వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకొని, వినాయక విగ్రహాల అమ్మకందారులు, తయారీదారులు గమనించవలసిన ముఖ్య సూచనల గురించి తెలియజేశారు. 

విగ్రహాలను మండపాలకు లేదా అమ్మకపు కేంద్రాలకు తరలించే సమయంలో రహదారులపై ఉన్న విద్యుత్ లైన్లకు దగ్గరగా రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వినాయక విగ్రహం 10 అడుగుల కంటే ఎత్తైన విగ్రహాలను తరలించే ముందు తప్పనిసరిగా విద్యుత్ శాఖకు సమాచారం ఇవ్వాలన్నారు. ఈ అవగాహన కార్యక్రమంలో డి ఈ,  కళ్యాణి చక్రవర్తి, ఏడిఈ కిరణ్ చైతన్య , విద్యుత్ సిబ్బంది  తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad