Thursday, August 21, 2025
E-PAPER
spot_img
Homeఆదిలాబాద్సర్వే నిర్వహించి నష్టాన్ని అంచనా వేయండి: కలెక్టర్

సర్వే నిర్వహించి నష్టాన్ని అంచనా వేయండి: కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్
వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణ  సర్వే నిర్వహించి అంచనాలు తయారు చేయాలనీ కలెక్టర్ రాజర్శి షా అన్నారు. జిల్లాలో వరద బీభత్సానికి డ్యామేజ్ అయినా వివరాలు, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా మెడికల్ క్యాంప్, సానిటేశన్, తదితర వాటి పైబుధవారం సంబంధిత అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. గత కొద్ది రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జిల్లాలో పలు ప్రాంతాల్లో వరదలు ఏర్పడి నష్టాలు సంభవించాయన్నారు. పునరుద్ధరణ చర్యలు, అవసరమైన సహాయం అందించడం పై స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. అలాగే, సౌర విద్యుత్ సంస్థాపన కోసం జిల్లాలోని ప్రభుత్వ భవనాల సర్వే పై కూడా సమీక్ష నిర్వహించి, అనుసరించాల్సిన పద్ధతుల గురించి సూచనలు ఇచ్చారు.

అధికారులు ప్రజలకు తక్షణ సహాయం అందించేందుకు చురుగ్గా చర్యలు చేపట్టాలని   ఆదేశించారు. అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేసి జిల్లాలో వర్షానికి దెబ్బతిన్న పంటలను, రోడ్లు, తదితర వాటి అంచనాలను వేగవంతంగా పూర్తి చేసి నివేదికలు సమర్పించాలని సూచించారు. సంబంధిత అధికారులు సర్వే నిర్వహించేటప్పుడు ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో పాటు శాశ్వత పరిష్కారానికి మండల, జీపీ ల వారిగా సర్వే చేసి నివేదికలు సమర్పించాలని, విద్యుత్, ఇళ్లలోకి నీరు చేరడం ప్రతీ సారి వర్షాలు పడినప్పుడు ఇదే పరిస్థితి నెలకొంటుందని అన్నారు. దీనికి శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. మున్సిపల్, ఇరిగేషన్, తదితర సంబంధిత సిబ్బంది నిర్వహించిన సర్వే అనంతరం సూపర్ చెక్ చేయాలనీ అధికారులను ఆదేశించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad