Thursday, August 21, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్తహశీల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన తొర్రూర్ ఆర్డీఓ

తహశీల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన తొర్రూర్ ఆర్డీఓ

- Advertisement -

నవతెలంగాణ – నెల్లికుదురు 
నెల్లికుదురు తహశీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ అద్వైద్ సింగ్ కుమార్ ఆదేశాల మేరకు సందర్శించి మండల సమస్యలను అడిగి తెలుసుకునే కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తొర్రూర్ ఆర్డీవో గణేష్ తెలిపారు. బుధవారం కార్యాలయంలోని తహసిల్దార్ నరేష్ ఎంఈఓ ఎస్కె యాస్మిన్ పిఏసిఎస్ సీఈవో శ్రీనివాస తో కలిసి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యూరియా బస్తాలు లోడు వచ్చినప్పుడు రైతులు ఒకేసారి గుంపులు గుంపులుగా ఎగబడకుండా ముందస్తుగా వారికి కూపన్లిచ్చి ఎన్ని బస్తాలు వస్తాయో అనే కూపన్లు ఇవ్వాలని చెప్పారు.

మళ్లీ దవలో మల్ల కొంతమందికి ఇస్తామని చెప్పి వారికి ఇవ్వాలని తెలిపారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క బస్తా చొప్పున వారి పట్టా బుక్కు ఆధార్ కార్డు తీసుకొని వారికి ఒక కోపం ఇచ్చి కూపాన్ని ఇచ్చిన వారు మాత్రమే లైన్లో ఉండాలని మిగతావారు రేపు వస్తాయి వారికి ఇస్తామని చెప్పాలని అందరిని అక్కడ కూర్చోబెట్టుకోవడం సరైనది కాదని అన్నారు. ఈ వర్షాకాల సీజన్లో మండలంలోని వివిధ గ్రామాల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ఏం చేస్తున్నారు ప్రజలు ఎలా ఉన్నారు అని సమస్యలను తహశీల్దార్ చందా నరేష్ ని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎం ఆర్ ఐ రామకృష్ణ వివిధ శాఖల సిబ్బంది ఉన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad