– ఆయన జయంతి సభలో అద్యక్షులు తుమ్మ
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఎమ్మెల్యే అధికారిక క్యాంపు కార్యాలయంలో బుధవారం మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి ని కాంగ్రెస్ శ్రేణులు నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల అధ్యక్షులు తుమ్మ రాంబాబు రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజీవ్ గాంధీ భారతదేశ యువ ప్రధానమంత్రిగా ఆధునిక భారత నిర్మాణానికి పునాది వేశారన్నారు.సమాచారం, సాంకేతిక రంగంలో నూతన మార్పులు తీసుకువచ్చి విద్యార్థులు యువతకు కొత్త అవకాశాలు అందించారన్నారు.ఆయన నాటి కార్యాచరణే నేటి డిజిటల్ భారతానికి బలమైన పునాదిగా మారాయన్నారు. గ్రామీణ ప్రాంత అభివృద్ధికి పేదల సంక్షేమానికి ఆయన చేసిన సేవలు మరువ లేనివని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సుంకవల్లి వీరభద్రరావు,నండ్రు రమేష్,దండాబత్తుల నరేష్,ముల్లగిరి కృష్ణ, నార్లపాటి అశోక్ తదితరులు పాల్గొన్నారు
నేటి సాంకేతిక సమాచార విప్లవానికి నాంది రాజీవ్ గాంధీనే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES