Thursday, August 21, 2025
E-PAPER
spot_img
Homeఖమ్మంవిద్యుత్ స్తంభాలపై కేబుల్ వైర్ లు తొలగింపుకు సన్నాహాలు

విద్యుత్ స్తంభాలపై కేబుల్ వైర్ లు తొలగింపుకు సన్నాహాలు

- Advertisement -

– అమలు చేయనున్న ఉపముఖ్యమంత్రి బట్టి ఆదేశాలు
– పరిశీలించిన ఎన్పీడీసీఎల్ ఏడీఈ వెంకటరత్నం
నవతెలంగాణ – అశ్వారావుపేట

రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ స్తంభాలపై ప్రమాదంగా మారిన కేబుల్ వైర్లను వెంటనే తొలగించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సచివాలయంలో మంగళవారం విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. వైర్లను తొలగించాలని కేబుల్ ఆపరేటర్లకు ఏడాదిగా నోటీసులు ఇస్తున్నా స్పందించకపోవడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైర్ల వల్ల ప్రజల ప్రాణాలకే ప్రమాదం వాటిల్లడం క్షమించరాని నేరమని మండిపడ్డారు.ఇక ఏమాత్రం ఉపేక్షించాల్సిన అవసరం లేదని, బలవంతంగా తొలగించే కార్య క్రమం చేపట్టాలని స్పష్టంచేశారు. అనుమతులు లేకుండా విద్యుత్తు కనెక్షన్లు ఏర్పాటు చేసుకునేవారిపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు.రాష్ట్రం లో ఎక్కడైనా విద్యుత్ కనెక్షన్ తీసుకునేవారు విద్యుత్ శాఖ సిబ్బంది సహాయంతోనే ఏర్పాటు చేసుకోవాలని, సాంకేతిక పరిజ్ఞానం లేని వ్యక్తుల ద్వారా కనెక్షన్లు ఏర్పాటు చేసుకోవడం వల్ల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందని అన్నారు.

ఈ నేపధ్యంలో విద్యుత్ శాఖ ఉన్నతాధికారుల ఆదేశానుసారం బుధవారం స్థానిక ఎన్పీడీసీఎల్ (ఆపరేషన్స్) ఏడీఈ వెంకటరత్నం బుధవారం విద్యుత్ సిబ్బందితో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మండలంలో బీఎస్ఎన్ఎల్,జియో,త్రిబుల్ ఎస్,స్మిర్ట్ సిటీ నెట్ వర్క్ లకు చెందిన కేబుల్స్ ఉన్నట్లుగా గుర్తించారు.ముందుగా ఆయా నెట్ వర్క్ యాజమాన్యాలకు నోటీస్ ఇచ్చిన అనంతరం ప్రమాదకరం గా ఉన్న కేబుల్స్ వైర్ లను తొలగింపుకు కార్యాచరణ చేపడతామని తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad