– కలెక్టర్ హైమావతికి వినతిపత్రం అందజేసిన మండల నాయకులు
నవతెలంగాణ – కోహెడ
కోహెడ మండల రైతులకు యూరియా కొరత తీర్చాలంటూ బుధవారం మార్కెట్ కమిటీ ఛైర్మన్ బోయిని నిర్మల జయరాజ్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ హైమావతికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతులు తమ పంట పొలాలను రక్షించుకునేందుకు యూరియా లేక ఇబ్బందులను ఎదుర్కోంటున్నట్లు వినతిపత్రంలో పేర్కోన్నారు. ఇప్పటికైనా మండలంలోని రైతులకు సరిపడా యూరియా అందజేయాలని కోరారు. దీనికి కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ భీమ్‌రెడ్డి తిరుపతిరెడ్డి, సీనియర్ నాయకులు కర్ర రవీందర్, నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు శివారెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ చేపూరి శ్రీశైలం, మాజీ ఎంపీటీసీ కోంపెల్లి శశిధర్, గూడ స్వామి, శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు, తదితరులు ఉన్నారు.
రైతులకు యూరియా కొరత తీర్చండి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES