బడే నాగజ్యోతి బిఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ ఇన్చార్జ్
నవతెలంగాణ – గోవిందరావుపేట
రంజిత్ కుటుంబానికి బి ఆర్ ఎస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉండి ఆదుకుంటుందని బి ఆర్ ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ ఇన్చార్జ్ బడే నాగజ్యోతి అన్నారు. బుధవారం మండలంలోని రాఘవపట్నం గ్రామంలోసువర్ణపాక రంజిత్ అనారోగ్యంతో మృతి చెందగా రంజిత్ దశదిన కార్యక్రమానికి హాజరై చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. అనంతరం నాగజ్యోతి ఇటువంటి పరిస్థితుల్లో కుటుంబ సభ్యులంతా మనోధైర్యంతో ఉండాలని అన్నారు.
కుటుంబానికి బి ఆర్ఎస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని ఇలాంటి ఆపదలోనైనా ఆదుకుంటుందని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు లకావత్ నరసింహ నాయక్, కంఠం నాగేశ్వరరావు, నాం పూర్ణచందర్, చుక్క గట్టయ్య, ఎట్టి జగదీష్, దర్శనాల సంజీవ, చుంచు యాకూబ్, ఇరుప సారయ్య, మాలోతు రవి, బొల్లం శివ, సామ నాగక్క, ఇరుప విజయ, తదితరులు పాల్గొన్నారు.
రంజిత్ కుటుంబానికి బీఆర్ఎస్ అండగా ఉంటుంది
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES