నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని నాగాపూర్ గ్రామ శివారులో గల వరద కాలువ గేట్లను ఆత్మ ప్రాజెక్ట్ డైరెక్టర్ తిరుమల ప్రసాద్ బుధవారం పరిశీలించారు. ప్రస్తుతం వరద కాలువలో నీటి ప్రవాహం తీరును ఎంపీడీవో శ్రీనివాస్ ను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదకర స్థాయిలో వరద కాలువ ప్రవాహం ఉంటే ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని సూచించారు. వరద కాలువలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నందున పశువుల కాపరులను, రైతులను వరద కాలువలోకి వెళ్లకుండా ఉండాలని గ్రామంలో దండోరా వేయించాలన్నారు. అనంతరం వన మహోత్సవంలో భాగంగా నాటిన మొక్కలను ఆయన పరిశీలించారు. మొక్కల సంరక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శి సంధ్యాను ఆదేశించారు. గ్రామానికి నిర్దేశించిన లక్ష్యం మేరకు మొక్కలు నాటే కార్యక్రమాన్ని పూర్తి చేయాలన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల మూలంగా ఎక్కడైనా నాటిన మొక్కలు పాడైతే వాటి స్థానంలో కొత్త మొక్కలను నాటించాలని సూచించారు.
వరద కాలువ గేట్ల పరిశీలన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES