నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 81వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. బస్టాండ్ సమీపంలో గల రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుంకేట రవి మాట్లాడుతూ రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు పేదరిక నిర్మూలన, కమ్యూనికేషన్, టెక్నాలజీ రంగాలకు గట్టి పునాదులు వేశారని గుర్తు చేశారు. రాజీవ్ గాంధీ ఆశయల సాధన కోసం పాటుపడుతూ, గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టతకు ప్రతి ఒక్కరు తమవంతుక కృషి చేయాలన్నారు.
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను కాంగ్రెస్ నాయకులంతా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోవాలన్నారు.రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అమలు చేస్తున్న 6 గ్యారంటీ లతోపాటు ప్రజా సంక్షేమ కార్యక్రమాలను గ్రామాల్లో ఇంటింటికి తీసుకు పోవాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సల్లూరి గణేష్ గౌడ్, నాయకులు నూకల బుజ్జి మల్లయ్య, నిమ్మ రాజేంద్రప్రసాద్, ఊట్నూరి ప్రదీప్, పూజారి శేఖర్, పాలెపు చిన్న గంగారం, నాగాపూర్ అశోక్, సింగిరెడ్డి శేఖర్, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES