నవతెలంగాణ-కమ్మర్ పల్లి
ప్రస్తుతం సోయాబీన్ పంటలో కాయ గట్టపడే దశలో ఉంది.ఈ మధ్య కురిసిన వర్షాలకు పంటలో తేమ ఎక్కువ ఉండటం వలన ఆకు మచ్చ తెలుగు ఉధృతి గమనించినట్లు ఉప్లూర్ క్లస్టర్ వ్యవసాయ విస్తీర్ణ అధికారి రమేష్ తెలిపారు. ఆకుమచ్చ తెగులు ఉదృతి వల్ల ఆకులు మరియు కాయల పైన మచ్చలు ఏర్పడి గింజ నాణ్యత తగ్గిపోతుందన్నారు.ఈ తెగులు గమనించినట్లైతే వెంటనే రైతులు టెబుకోనజోల్ 10% సల్ఫర్ 65% WG 2.5గ్రా/లీటర్ (లేదా) ప్రోపికాజోల్ 1 మీలీ/లీటరు ( లేదా) అజిక్సీ స్ట్రాబిన్ + టేబుకోనజోల్ 1మీలీ /లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలని ఆయన సూచించారు. తద్వారా సోయాబీన్ పంటలో ఆకుమచ్చ తెగులు ఉధృతిని నివారించవచ్చని తెలిపారు. రైతులు పంటల్లో ఏదైనా తెగులు గమనించినట్లైతే వ్యవసాయ శాఖ సిబ్బందికి సమాచారం అందిస్తే, ఫీల్డ్ విసిట్ చేసి తగిన సస్య రక్షణ చర్యలు సూచించడం జరుగుతుందన్నారు.
సోయాబీన్ పంటలో ఆకుమచ్చ తెగులు ఉధృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES