నవతెలంగాణ – కాటారం
అత్యవసర వైద్య సేవల సమయాల్లో 108 సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు సేవలందించాలని భూపాలపల్లి జిల్లా మేనేజర్ ఆదేశించారు. మంగళవారం మండల కేంద్రమైన కేంద్రంలో ఉన్న 108 వాహనాలను ఆకస్మికంగా ఆయన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా 108 వాహనాల్లో ఉన్న మెడికల్ ఈక్యుమెంట్స్,వర్కింగ్ కండిషన్,మెడికల్ స్టాక్ వెరిఫై చేసి,రికార్డ్స్ అప్డేట్ చెక్ చేసినట్లుగా తెలిపారు.వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించి,పలు సూచనలు చేశారు.
ఎప్పటికప్పుడు మెడిసిన్స్ అప్డేట్ చేసుకుంటూ అందుబాటులో ఉంచుకొని కాల్ రాగానే తొందరగా బయలుదేరాలని మండల ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి ప్రథమ చికిత్స చేస్తూ దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్ కి తొందరగా తీసుకువెళ్లాలనీ సిబ్బందికి సూచనలు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు సోకకుండా తీసుకోవలసినటువంటి జాగ్రత్తగా గురించి కూడా వివరించడం జరిగింది. ఈ ప్రాంతాలలో Floods ఎక్కువ వచ్చే అవకాశం ఉండడం వలన ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఈ అత్యవసర సేవలలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని సిబ్బందికి సూచనలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ శ్రీకాంత్ మరియు పైలెట్ విజేందర్ పాల్గొన్నారు.