Thursday, August 21, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్మంత్రి పొలానికి యూరియా ఫుల్.. రైతులకేమో నిల్లా..?

మంత్రి పొలానికి యూరియా ఫుల్.. రైతులకేమో నిల్లా..?

- Advertisement -

నాయకుడు రామిల్ల రాజబాపు..
రైతులకు సరైన పత్రాలు లేవంటూ గోసపుచ్చుకుంటున్న కాటారం పీఏసీఎస్ అధికారులు
మంత్రి పొలానికి ఆటోలో 30 బస్తాలు ఒకేసారి పంపిన పీఏసీఎస్ అధికారులు..
నవతెలంగాణ – కాటారం

ప్రజల అవసరాలను తెలుసుకొని సమస్యలు పరిష్కరించాల్సింది పోయి, వడ్డించే వాడే అన్ని తన బొజ్జలో వేసుకున్నట్లుగా ఒకేసారి మంత్రిగారే వందల బస్తాలు తీసుకెళితే ఎలా అంటూ కాటారం మండల బీఆర్ఎస్ నాయకుడు రామిల్ల రాజబాపూ అన్నారు. ఈ సందర్బంగా ఆయన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ…. కాటారం మండల కేంద్రంలోని కాటారం PACS ఆధ్వర్యంలో పంపిణీ చేయాల్సిన యూరియా బస్తాలను సంబంధిత అధికారులు వారికి నచ్చిన వారికి ఇష్టం వచ్చిన విధంగా, నచ్చని వారికి పత్రాల సాకుతో, ఒకరికి, ఒకటి! రెండు? కూడా ఇవ్వడం లేదని తెలిపారు. రైతులు పాపం ఉదయం 6 గంటలకు వస్తే మధ్యాహ్నం తిండి తిప్పలు మానిమరి సాయంత్రం 6 గంటల వరకు కూడా యూరియా బస్తాలు, ఒకరికి ఒకటి రెండు మాత్రమే ఇయడంతో, కొందరికి మొత్తమే స్టాకు అయిపోయి అందకపోవడంతో, రైతులు తనకు అవసరం ఉన్న యూరియా కోసం మరుసటి రోజు కూడా వచ్చి క్యూలైన్లలో గంటల తరబడి రోజంతా నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది.

అదే అధికార పార్టీకి చెందిన వారి కైతే ఏపత్రాలు లేకున్నా ఎన్ని కావాలంటే అన్ని అనధికారికంగా ఇస్తున్నారని, కాటారం PACS అధికారులు, మొన్న,ఒక అడుగు ముందుకేసి మరి కాటారం మండలం ధన్వాడ గ్రామంలోని మంత్రి శ్రీధర్ బాబు వ్యవసాయ క్షేత్రంకు మాత్రం ఒక ఆటోలో 30 బస్తాల చొప్పున పంపిస్తున్నారని, ఓట్లు వేసిన ప్రజలను, రైతుల నైతే రోజంతా లైన్లో నిలబెడుతున్నారని భా.రా.స నాయకుడు రామిల్ల రాజబాపు వాపోయినాడు. తక్షణమే జిల్లా కలెక్టర్, జిల్లా అధికారులు స్పందించి రైతులను గోస పెడుతున్న పిఎసిఎస్ కాటారం అధికారులపై చర్యలు తీసుకోవాల్సిందిగా, అలాగే రైతులకి కావలసినంత యూరియా అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశాడు. లేదంటే రైతులతో కలిసి భా.ర.స ఆధ్వర్యంలో కాటారం అంబేద్కర్ ముందు ధర్నా నిర్వహిస్తామని అధికారులను హెచ్చరించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad