-అదనపు జెడ్పీ సీఈఓ భాగ్యలక్ష్మి
-మండల ప్రత్యేకాధికారిగా బాధ్యతలు
-ఎస్సీ వసతి గృహం సందర్శన ..
-ఎంపీడీఓ కార్యాలయంలో రికార్డుల తనిఖీ
నవతెలంగాణ – బెజ్జంకి
దోమలు విస్తరించకుండా నీటీ నిల్వలున్న ప్రాంతాల్లో ఆయిల్ బాల్స్ వేయాలని అదనపు జెడ్పీ సీఈఓ భాగ్యలక్ష్మి ఎంపీడీఓ ప్రవీన్ కు సూచించారు. బుధవారం మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర వసతి గృహాన్ని అదనపు జెడ్పీ సీఈఓ భాగ్యలక్ష్మి ఆకస్మికంగా సందర్శించారు.వంటగది, విద్యార్థుల గదులు,మేనూ ప్రకారం అందుబాటులో ఉన్న బోజన సామాగ్రిని పరిశీలించారు.విద్యార్థులకు మేనూ ప్రకారం బోజనం అందించాలని వార్డెన్ మధు సూధన్ రెడ్డికి సూచించారు.
వసతి గృహ పరిసరాల పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.అనంతరం ఎంపీడీఓ కార్యాలయాన్ని సందర్శించి మండల ప్రత్యేకాధికారిగా అదనపు జెడ్పీ సీఈఓ భాగ్యలక్ష్మి బాధ్యతలు చేపట్టారు.కార్యాలయంలోని పలు రికార్డులను తనిఖీ చేశారు.ఆరోగ్య కేంద్రం అవరణంలో నిల్వ ఉన్న నీటీలో ఆయిల్ బాల్స్ వేశారు.జిల్లా పరిషత్ సూపరిండెంట్ వినయ సుకుమారి,ఎంపీడీఓ ప్రవీన్,ఎంపీఓ మంజుల,పంచాయితీ కార్యదర్శి ప్రనీత్ రెడ్డి,కారోబార్ బోనగిరి లక్ష్మన్ పాల్గొన్నారు.
నీటీ నిల్వల్లో ఆయిల్ బాల్స్ వేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES