సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ
రామన్నపేటలో ఘనంగా ప్రజానాట్యమండలి వీధినాటకోత్సవాలు ప్రారంభం
నవతెలంగాణ – నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
ప్రజా పాటకు బహువచనం ప్రజానాట్యమండలి అని సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ అన్నారు. ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో రామన్నపేట మండల కేంద్రంలో జానపద వీధి నాటకోత్సవాలకు గ్రామీణ వృత్తి కళాకారులు వందలాది మంది హాజరై స్థానిక తహసిల్దార్ కార్యాలయం నుండి ర్యాలీ సభా వేదిక వరకు సాగింది. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా విచ్చేసిన జానపద కళాకారుల భారీ ప్రదర్శనను ప్రజానాట్యమండలి జెండా ను ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి కట్ట నరసింహ జెండా ఊపి ప్రారంభించారు.. అనంతరం స్థానిక పాత బస్టాండ్ ఆవరణలో జరిగిన వీధినాటక ఉత్సవాలను
సుద్దాల హనుమంతు యాదిలో ప్రజాకవి సుద్దాల హనుమంతు కళా ప్రాంగణంలో సర్ హష్మి ఓపెన్ థియేటర్ లో. షాట్ –2025 ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నుండి నేటి ప్రజా పోరాటాల వరకు ప్రజానాట్యమండలిది వన్నెతెగ్గని పాత్ర అని అన్నారు. జానపద రూపాలు అంతరించిపోతున్న ఈ తరుణంలో సబ్బండ కళారూపాల ప్రదర్శన నిర్వహించడం అభినందనీయమని ప్రజా కళలకు చావులేదని, భూ ప్రపంచం ఉన్నంతవరకు, ప్రజా పోరాటాలు ఉన్నంతవరకు పాటకు ప్రాణం ఉంటుందని అన్నారు. రామన్నపేట మండల ప్రాంతంలో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు సుద్దాల హనుమంతు నడయాడారని వారి యాదిలో కళా ప్రదర్శన నిర్వహించడం ఆనందదాయకమని పేర్కొన్నారు .
ప్రజా పోరాటాలకు ఆయుధం ఇచ్చింది కళారూపాలే అని మాజీ శాసనమండలి సభ్యులు ఆహ్వాన సంఘం గౌరవాధ్యక్షులు చెరుపల్లి సీతారాములు అన్నారు. నేటి ప్రపంచీకరణ నేపథ్యంలో వస్తున్న వింత పోకడలో ప్రజా కళలు పెట్టుబడిదారుల చేతుల్లోకి వెళుతున్నాయని. సినిమాలు ఇతర రూపాల్లో అవి వికృత రూపం దాల్చుకుంటున్నాయని అన్నారు. ప్రజానాట్యమండలి ప్రజల కళారూపాలను భుజానికి ఎత్తుకొని ముందుకు పోవాలని అన్నారు. అనంతరం చందు యక్షగానం భాగవతం కోలాటం డబ్బులు బుర్రకథలు అనేక కళారూపాల ప్రదర్శన నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక సారధి జిల్లా కోఆర్డినేటర్, ప్రజా గాయని వేముల పుష్ప, ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి కట్ట నరసింహ, మాజీ నాయకులు ఎండీ జహంగీర్, ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గంటపాక శివకుమార్,ఈర్లపల్లి ముత్యాలు, దేశపాక రవి, ఆహ్వాన సంఘం అధ్యక్షుడు కూరెళ్ళ నరసింహాచారి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేల్పుల వెంకన్న, మండల అధ్యక్ష కార్యదర్శులు మేడి పృథ్వి, గంటపాక శ్రీకృష్ణ, కందుల హనుమంతు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు జల్లెల పెంటయ్య, ఎస్ఎఫ్ఐ మాజీ జిల్లా కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, ప్రజానాట్యమండలి మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

