నవతెలంగాణ – హైదరాబాద్: మేడ్చల్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే చనిపోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడట్టు తెలిసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర పరిధిలోని ఓఆర్ఆర్ పై బీదర్ నుంచి హైదరాబాద్ వస్తున్న కారు.. ఓ భారీ కంటైనర్ ను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. దీంతో కారు ముందు సీట్లో కూర్చున్న యువకులు స్పాట్ లోనే మృతి చెందగా.. వెనుక సీట్లో కూర్చున్న మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. అయితే క్షతగాత్రుల్లోని మరొకరి పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్టు సమాచారం. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
ఓఆర్ఆర్ పై ఘోర రోడ్డు ప్రమాదం..
- Advertisement -
- Advertisement -