మార్కెట్ కమిటీ డైరెక్టర్ గుర్రం విద్యాసాగర్..
నవ తెలంగాణ వేములవాడ:
యువత స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలని మార్కెట్ కమిటీ డైరెక్టర్ గుర్రం విద్యాసాగర్ అన్నారు. వేములవాడపట్టణంలోని కోరుట్ల బస్టాండ్ లో బుధవారం జరిగిన మణికంఠ సూపర్ మార్కెట్ ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.ఈ సందర్భంగా విద్యాసాగర్ మాట్లాడుతూ, “స్వయం ఉపాధితోనే యువత భవిష్యత్తు అభివృద్ధి సాధ్యమవుతుంది. సమాజానికి ఉపయోగపడే రంగాల్లో అడుగులు వేయాలి” అని సూచించారు. అలాగే నిర్వాహకుడు గొల్లపల్లి సాయి ప్రసాద్ ను అభినందించి, సూపర్ మార్కెట్ అభివృద్ధి చెంది లాభదాయకంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.ఈకార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు కత్తి కనకయ్య, మునుపటి పరశురాములు, చిట్ల తిరుపతి, అనిల్, శేఖర్, మల్లేశం, రాకేష్, బొజ్జ మల్లయ్య, నిర్వాహకుడి కుటుంబ సభ్యులు తోపాటు తదితరులు పాల్గొన్నారు.