Thursday, August 21, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్విద్యార్థి చదువులకు వైద్యుల చేయూత 

విద్యార్థి చదువులకు వైద్యుల చేయూత 

- Advertisement -

రూ.22 వేలు ఆర్థిక సహాయం 
దాతలకు కృతజ్ఞతలు తెలిపిన విద్యార్థి 
నవతెలంగాణ – పాలకుర్తి

నిరుపేద గిరిజన విద్యార్థి చదువులకు వైద్యులు ఆర్థిక చేయూతను అందించారు. మండలంలోని కొండాపురం పెద్దతండ కె గ్రామానికి చెందిన గిరిజన విద్యార్థి భూక్య వంశీ కి ఢిల్లీ యూనివర్సిటీలో అడ్మిషన్ దక్కడంతో ఆర్థిక పరిస్థితులతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు. విద్యార్థి వంశీకి హార్దిక చేయూతను అందించి ఉన్నత చదువులు చదివేందుకు దోహదపడాలనే దృఢ సంకల్పంతో పాలకుర్తి లో గల శ్రీ హరిత ఆసుపత్రి వైద్యులు డాక్టర్ గుగులోతు సంజయ్ నాయక్, లోహిత్ దంత వైద్యశాల వైద్యులు డాక్టర్ సునార్ కోటేష్ నాయక్, యశోద ఆసుపత్రి వైద్యులు డాక్టర్ చిదురాల మహేందర్ లతోపాటు రాపాక సోమయ్య ఫర్టిలైజర్ షాపు యజమాని రాపాక సంతోష్, బిఆర్ఎస్ బీసీ మండల నాయకులు కమ్మగాని వెంకటేశ్వర్లు గౌడ్ లు 22 వేలు ఆర్థిక సహాయాన్ని అందించి అండగా నిలిచారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాతలు అందిస్తున్న సహాయాన్ని సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని, పాలకుర్తి ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపును తీసుకురావాలని ఆకాంక్షించారు. లక్ష్య సాధన కోసం ఉన్నత చదువుల్లో రాణించి ఉన్నత శిఖరాలకు ఎదగాలని సూచించారు. పేద విద్యార్థుల చదువులకు అండగా ఉంటామని తెలిపారు. దాతల దాతృత్వాన్ని వమ్ము చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆర్థిక సహాయాన్ని అందిస్తున్న దాతలకు విద్యార్థి వంశీ తో పాటు కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad