పదేళ్లుగా ఉద్యోగస్తులు మోసపోయారు
సెప్టెంబర్ 1న విద్రోహ దినంగా పాటించాలి
మహా ధర్నాను విజయవంతం చేయాలి : టి ఎస్ పి ఆర్ టి యు
నవతెలంగాణ – పాలకుర్తి
ప్రజల చేత ఎన్నుకోబడి ఐదు సంవత్సరాలు ప్రజలకు సేవ చేసే ప్రజాప్రతినిధులకు ఒక న్యాయం, 30 ఏళ్లుగా విద్యార్థినీ విద్యార్థులను భావిభారత పౌరులుగా, శాస్త్రవేత్తలుగా, పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడంలో నిరంతరం కృషి చేస్తున్న ఉద్యోగస్తులకు, ఉపాధ్యాయులకు మరొక న్యాయమా అని టీఎస్ టిఆర్టియు ప్రశ్నించింది. సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాదులో గల ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద సెప్టెంబర్ 1న టిఎస్పిఆర్టియు ఆధ్వర్యంలో శాంతియుతంగా నిర్వహించే మహా ధర్నాను విజయవంతం చేయాలని కోరుతూ బుధవారం మండల కేంద్రంలో గల ఉన్నత పాఠశాలలో టీఎస్పీఆర్టియు మండల అధ్యక్ష, కార్యదర్శులు బైకానీ వెంకటయ్య, వడ్లకొండ శ్రీనివాస్ లతో కలిసి మండల విద్యాశాఖ అధికారి పోతుగంటి నర్వస్సయ్య లు వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం పదేళ్లుగా సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తామని ఉద్యోగులను, ఉపాధ్యాయులను మోసం చేసిందని ఆరోపించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 20 నెలలు గరుస్తున్నప్పటికీ సిపిఎస్ విధానం రద్దు పై స్పందించడం లేదని అన్నారు. సిపిఎస్ విధానం 2004 సెప్టెంబర్ 1న అమల్లోకి వచ్చిందని తెలిపారు. సిపిఎస్ విధానానికి వ్యతిరేకంగా సెప్టెంబర్ 1న విద్రోహ దినంగా పాటిస్తూనే ఉన్నామని తెలిపారు. ఐదు సంవత్సరాలు ప్రజలకు సేవ చేసిన ఎంపీ, ఎమ్మెల్యేలకు పెన్షన్లు ఇస్తున్నారని, 30 ఏళ్లుగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఫంక్షన్స్ సౌకర్యం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సిపిఎస్ విధానాన్ని వ్యతిరేకిస్తూ సెప్టెంబర్ 1 హైదరాబాదు లోగల ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద పిఆర్టియు ఆధ్వర్యంలో శాంతియుతంగా మహాధర్నాను నిర్వహిస్తున్నామని తెలిపారు. పిఆర్టియు ఆధ్వర్యంలో నిర్వహించే మహాధర్నా కార్యక్రమానికి ఉపాధ్యాయులు నల్ల దుస్తులతో హాజరుకావాలని పిలుపునిచ్చారు.
ధర్నా కార్యక్రమానికి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి, పి ఆర్ టి యు రాష్ట్ర అధ్యక్షులు గుండు లక్ష్మణ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుల్గం దామోదర్ రెడ్డి, ఏఐఎఫ్టీవో జనరల్ సెక్రెటరీ సిఎల్ రోస్ హాజరవుతున్నారని అన్నారు. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాలకుర్తి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఉపాయం శోభారాణి, పిఆర్టియు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు కూటికంటి సోమయ్య, భీరం వెంకట్ రెడ్డి, మండల కార్యదర్శి రావుల మనోహర్, ఉపాధ్యాయులు రమేష్,నర్సింహా మూర్తి, రవి,ఉపేందర్, సంపత్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజా ప్రతినిధులకు ఒక న్యాయం.. ఉద్యోగస్తులకు మరొక న్యాయమా!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES