Thursday, August 21, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఉత్తమ ఫోటోగ్రాఫర్ కు సన్మానం.. 

ఉత్తమ ఫోటోగ్రాఫర్ కు సన్మానం.. 

- Advertisement -

నవతెలంగాణ-పాలకుర్తి
ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం మండలంలోని ముత్తారం గ్రామానికి చెందిన గజ్జి రాజును ఉత్తమ ఫోటోగ్రాఫర్ గా గుర్తించి ఫోటోగ్రాఫర్ల సంఘం నాయకులు మండల కేంద్రంలో గల శ్రీ సోమేశ్వర ఫంక్షన్ హాల్ లో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆ సంఘం మండల అధ్యక్షుడు రాపోలు రాంబాబు మాట్లాడుతూ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఏడాది ఒక ఫోటోగ్రాఫర్ ను ఎంపిక చేసి ఉత్తమ ఫోటోగ్రాఫర్ గా సన్మానించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫోటోగ్రాఫర్ల సంఘం జిల్లా ఆర్గనైజర్ రాపోలు లక్ష్మణ్, ఫోటోగ్రాఫర్లు పట్టూరి శ్రీనివాస్, ఎడవెల్లి వెంకన్న, గుడికందుల నరేష్,చిలుముల్ల బాబు, చెనబోయిన అశోక్,బొమ్మగాని ప్రదీప్, వర్ధమాన శ్రీనివాస్,పన్నీరు సంతోష్,అక్కల రమణ,వసూరి మహేష్, గుగ్గిళ్ళ సురేష్  తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad