Thursday, August 21, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్రాజీవ్ గాంధీ స్ఫూర్తితో రాష్ట్రంలో ప్రజా పాలన 

రాజీవ్ గాంధీ స్ఫూర్తితో రాష్ట్రంలో ప్రజా పాలన 

- Advertisement -

రాజీవ్ గాంధీ ప్రవేశపెట్టిన సంస్కరణలే దేశ అభివృద్ధికి స్ఫూర్తి: ఎమ్మెల్యే యశస్విని రెడ్డి 
పాలకుర్తిలో ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు 
నవతెలంగాణ – పాలకుర్తి

రాజీవ్ గాంధీ ప్రవేశపెట్టిన సంస్కరణలను స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్రంలో ప్రజా పాలన కొనసాగుతుందని ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకుని బుధవారం మండల కేంద్రంలో గల రాజీవ్ గాంధీ విగ్రహానికి టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమండ్ల ఝాన్సీ రెడ్డితో కలిసి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, టిపిసిసి ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి లు మాట్లాడుతూ భారతదేశానికి ఆధునికతను అందించేందుకు దూరదృష్టితో రాజీవ్ గాంధీ పాలనను కొనసాగించాడని తెలిపారు. సాంకేతిక రంగంలో దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన గొప్ప నాయకుడని కొనియాడారు. రాజీవ్ గాంధీ ప్రవేశపెట్టిన సాంకేతిక విప్లవం, పంచాయతీరాజ్ వ్యవస్థ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో దోహదపడ్డాయని తెలిపారు.

ఐటీ రంగానికి రాజీవ్ గాంధీ బీజం వేశారని తెలిపారు. దేశ సమగ్ర అభివృద్ధి కోసం ఎన్నో సంస్కరణలను తీసుకువచ్చారని కొనియాడారు. గ్రామీణ అభివృద్ధి, మహిళ సాధికారత లాంటి సంస్కరణలు స్ఫూర్తిదాయకమన్నారు. రాజీవ్ గాంధీ ఆశయ సాధన కోసం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సైనికుల వలె పనిచేసి రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పాలకుర్తి మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ లావుడియా మంజుల, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గిరగాని కుమారస్వామి గౌడ్, కొడకండ్ల మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎర్రబెల్లి రాఘవరావు, దేవస్థాన మాజీ చైర్మన్ చిలువేరు కృష్ణమూర్తి, పాలకుర్తి సొసైటీ మాజీ చైర్మన్ వీరమనేని యాకాంతారావు, మహిళ అధ్యక్షురాలు బండిపెళ్లి మనమ్మ, పాలకుర్తి పట్టణ అధ్యక్షులు కమ్మగాని నాగన్న గౌడ్, నాయకులు పెనుగొండ రమేష్, బైరు భార్గవ్, జలగం కుమార్, జాటోతు వెంకన్న, మేకల కుమార్, సునీల్, భాస్కర్, సలేంద్ర సంపత్, ఏలూరు యాకన్న, ఎండి నజీర్, హరీష్, మహేందర్ రెడ్డి, గడ్డం యాక సోమయ్య, మామిండ్ల నరేందర్, సలేంద్ర శ్రీను, ఆదినారాయణ, అనుముల అంజి రావు, ఆకుల నాగరాజు, మామిండ్ల ఫోన్క్స్ యాకన్న తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad