ఎంపీడీఓ శ్రీనివాస్
నవతెలంగాణ – మల్హర్ రావు
అంగన్ వాడి కేంద్రాల్లో మెనూ ప్రకారం ప్రభుత్వం చిన్నారులకు,గర్భిణీలు,బాలింతలకు అందించే పోషకారం అందించాలని మండల ఎపిడిఓ శ్రీనివాస్ అంగన్ వాడి టీచర్లను ఆదేశించారు. బుధవారం మండలంలోని మల్లారం గ్రామంలో పలు అంగన్ వాడి కేంద్రాలను సందర్షించారు.ఈ సందర్భంగా పోషకాహార, రోజు వారీ రికార్డులను పరిశీలించారు.అనంతరం జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో ఉన్న పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించి, ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు మౌలిక వసతులపై అరా తీశారు. ఆరోగ్య ఉప కేంద్రాన్ని పరిశీలించారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో వైద్య సిబ్బంది సమయ పాలన పాటించాలని ఆదేశించారు. గ్రామపంచాయతీ పరిధిలో నిరంతరం సానిటేషన్ పనులు నిర్వహించాలని పంచాయతీ కార్యదర్శి చెలకల రాజు యాదవ్ ను ఆదేశించారు. వాటర్ ట్యాంకులను,అంతర్గత రోడ్లపై పరిసరాలను పరిశీలించారు. నెలలో మూడు సార్లు వాటర్ ట్యాంక్ క్లీన్ చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అంగన్ వాడి,వైద్య,జీపీ సిబ్బంది పాల్గొన్నారు.
అంగన్ వాడిల్లో మెనూ ప్రకారం పోషకాహారం అందించాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES