Thursday, August 21, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్డేంజర్ జోన్ నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించండి.!

డేంజర్ జోన్ నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించండి.!

- Advertisement -

సీఎం క్యాంప్ ఆఫీసుకు భూ నిర్వాసితుల పోస్ట్ కార్డ్ ల పంపిణీ..
నవతెలంగాణ – మల్హర్ రావు

ఓసిపి డేంజర్ జోన్ నుంచి సురక్షితమైన ప్రాంతానికి తమను తరలించాలని తాడిచెర్ల, కాపురం భూ నిర్వాసితుల హక్కుల సాధన పోరాట కమిటి అధ్యక్షుడు కేశారపు రవి ఆధ్వర్యంలో బుధవారం తాడిచెర్ల పొస్తపిస్ కార్యాలయం వద్ద ఉన్న పోస్ట్ డబ్బాలో సీఎం క్యాంపు కార్యాలయానికి 2 వేల పోస్టు కార్డులు వేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. గత ఎనిమిది సంవత్సరాల నుండి ఓసీపీకి డేంజర్ జోన్లో పొల్యూషన్ గాలి పీలుస్తూ జీవించడంతో అనేకమైన రోగాల రావడంతో తాము ఇబ్బందులకు గురివుతున్న నేపథ్యంలో తమని సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు త్వరగతిన చర్యలు చేపట్టాలని కోరారు.గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చి మూడు సంవత్సరాలు గడుస్తున్న డేంజర్ జోన్లో ఉన్న ఇండ్లను తీసుకోకుండా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందని వాపోయారు.

బొగ్గు వెలికి తీయడానికి వేస్తున్న బాంబుల బ్లాస్టింగ్ వల్ల తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని తెలిపారు.తక్షణమే తమ ఇండ్లను సేకరించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ  మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నిర్వాసితులు ఇందారపు సరీన్,ఇందారపు సమ్మయ్య,మంతెన సమ్మయ్య,ఇందారపు సారయ్య ,ఇందారపు ప్రవీణ్,ఇందారపు బృందం, ఇందారపు ప్రమీల,తుంగపల్లి లక్ష్మి,ఇందారపు స్వరూప,బందెల శ్రీను,ఇందారపు సాగర్ పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad