ప్రపంచం నుండి పోలియో వ్యాధిని పారదోలిన రోటరీ సంస్థ
రోటరీ 3150 డిస్టిక్ గవర్నర్ డాక్టర్ ఎస్ వి రాంప్రసాద్
నవతెలంగాణ – కంఠేశ్వర్
నూతన పద్ధతులలో కృత్రిమ అవయవాల బిగింపు కార్యక్రమాలు చేపడుతూ ప్రజల్లోకి వెళ్తున్నామని, ప్రపంచంలో నుండి పోలియో వ్యాధిని రోటరీ సంస్థ పారుద్రోలిందీ అని రోటరీ 3150 డిస్టిక్ గవర్నర్ డాక్టర్ ఎస్ వి రాంప్రసాద్ తెలిపారు. ఈ మేరకు బుధవారం నగరంలోని వంశీ ఇంటర్నేషనల్ హోటల్లో రోటరీ క్లబ్ జేమ్స్ సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం విలేకరులతో డిస్టిక్ గవర్నర్ డాక్టర్ ఎస్ వి సాంప్రసాద్ విలేకరుల ఉద్దేశించి మాట్లాడారు. రోటరీ సంస్థ 1905లో ఏర్పడిందని ప్రపంచవ్యాప్తంగా అనేక అనేక సేవా కార్యక్రమాలు నేటి వరకు చేస్తున్నామని భవిష్యత్తులో కూడా చేస్తామని తెలిపారు. పర్యావరణం పెంచటానికి డ్రోన్ల ద్వారా సీడ్ బాల్స్ ను వేయటం జరుగుతున్నది అన్నారు.
చేయి, కాలు లేని వికలాంగులకు ఆధునిక టెక్నాలజీ ద్వారా బరువు లేని అవయవాలను అమర్చుతున్నామని దీని ద్వారా వారు ఈజీగా పని చేసుకోవచ్చని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు విద్యార్థినులకు అవసరమైన అన్ని రకాల సౌకర్యాలు బెంచీల వితరణ, టాయిలెట్స్ ల నిర్మాణం, నోట్ బుక్స్ పంపిణీ, డ్రింకింగ్ వాటర్ ట్యాంక్స్, మహిళా విద్యార్థినులకు సైకిల్ పంపిణీ, పేద విద్యార్థులకు కంప్యూటర్ల వితరణ జరుగుతుందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా సేవారంగంలో రోటరీ సంస్థ ముందంజలో ఉందని అన్నారు. రోటరీలో సభ్యత్వాన్ని రోటరీ క్లబ్స్ లను ముఖ్యంగా రోటరీ మహిళా క్లబ్స్ లను ఏర్పాటు చేసే విధంగా ప్రస్తుత సభ్యులు ప్రయత్నాలు చేయాలని సూచించారు. కుల, మత జాతి పేద ధనిక అనే తేడా లేకుండా అందరికీ సేవలను అందిస్తున్నది రోటరీ సంస్థ అని తెలిపారు.
రాబోవు కాలంలో నూతన టెక్నాలజీతో మరిన్ని సేవలను అందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ నిజామాబాద్ అధ్యక్షులు పాకాల నరసింహారావు, కార్యదర్శి గంజి రమేష్, అసిస్టెంట్ గవర్నర్ జయపాల్ రెడ్డి, కామారెడ్డి, ఫ్యూచర్ అధ్యక్షులు పడాల సత్తయ్య పాల్గొనగా, రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ అధ్యక్షులు శ్యామగర్వాల్, కార్యదర్శి గోవింద్ జవహర్ వంజరి శ్రీనివాస్ తదితరులు డిస్టిక్ గవర్నమెంట్ కలిసి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు.
నూతన పద్ధతులలో కృత్రిమ అవయవాల బిగింపు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES